Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Visakhapatnam Crime: విశాఖ బాలిక మృతి కేసులో మరో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తల్లి, అమ్మమ్మ..
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా డైరెక్టర్ గీతా కృష్ణ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన నిజాలు బయట పెట్టాడు. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Rain Alert in Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం
డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడుతూ ” ప్రవస్తి పోస్ట్ ను నేను ఫేస్ బుక్ లో చేశాను. చాలా బాధేసింది. చిన్న పిల్లలను అలాంటి డ్రస్సులు వేసుకురామని చెప్పడం ఏంటి ? కీరవాణి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ .. అతని మీద కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అతను అలా చేశాడంటే నాకు నమ్మాలనిపించడం లేదు. ఆ పాటల షో ప్రొడక్షన్ వారు డబ్బులు పెట్టండి.. మంచి డ్రస్సులు వేసుకుని వస్తారు. ప్రవస్తి చెప్పిన దాని ప్రకారం అక్కడ వేసుకునే కాస్ట్యూమ్ కూడా ఇవ్వరంట.. ఆ అమ్మాయి మొత్తం చెబుతుంది.. అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని? అంత బాధ కలిగితేనే కదా చెప్పుకునేదంటూ కామెంట్స్ చేశాడు. ఆ షో లో వాళ్ళకి నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసి, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి? ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించాడు. ఆ అమ్మాయి అంత ధైర్యంగా చెబుతుందంటే తను చెప్పింది ప్రతిదీ నిజమయ్యే ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లు అన్ని చూశాను. చాలా కాన్ఫిడెంట్ గా ప్రతి విషయం చెబుతుంది. ఒక అమ్మాయి బయటకొచ్చి చెబుతుందంటే అది నిజమే అన్నట్టు లెక్క. నేను తమిళంలో ఎలిమినేట్ అయ్యాను. నేను ఎప్పుడు అంతలా బాధ పడలేదు. కానీ, ఇక్కడ చాలా హర్ట్ అయ్యాను అని చెబుతుంది అంటే అంత బాధ పెట్టె ఉంటారుగా ” అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు