Praveen on Paradha Movie
ఎంటర్‌టైన్మెంట్

Paradha Film: ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు.. రివ్యూస్ చూసే థియేటర్స్‌కు రమ్మంటోన్న దర్శకుడు

Paradha Film: ‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల నుంచి వస్తోన్న మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ‘పరదా’ (Paradha). ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతుతో వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించగా.. దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆగస్ట్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

‘‘ఈ ‘పరదా’ కథ ఎప్పుడో రాసుకున్నాను. నేను దుల్కర్ సల్మాన్‌తో ఒక సినిమా చేయాలి. కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. విజయ్ ‘సినిమా బండి’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు.. ఈ ‘పరదా’ కథ చెప్పాను. ఆయనకు బాగా ఇచ్చింది. వెంటనే అనుపమకు ఈ కథ చెప్పాము. కథ వినగానే ఆమె కూడా ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కథ కోసమే చూస్తున్నాను అంటూ వెంటనే ఓకే చెప్పారు. తర్వాత దర్శన, సంగీత ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశాం. దాదాపు మూడేళ్లు చిత్రీకరణకు టైమ్ పట్టింది. మనాలి, ధర్మశాల వంటి ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో.. వందమంది క్రూ తో ఈ సినిమాని షూట్ చేశాం. గౌతమ్ మేనన్, రాజేంద్ర ప్రసాద్, రాగ్ మయూర్ ఇలా ఈ సినిమాకు చాలా పెద్ద కాన్వాస్ ఉంది. నా వరకు ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ప్రతిసారి సర్‌ప్రైజ్ అవుతూనే ఉంటారు.

Also Read- RGV on Dog lovers: డాగ్ లవర్స్‌కు వర్మ 10 ప్రశ్నలు.. సదాకు డైరెక్ట్ కౌంటర్!

ఏ సినిమాకైనా ఆడియన్సే న్యాయ నిర్ణీతలు. రివ్యూస్ ఎలా వచ్చినా సరే వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమాలో ఏముందో జెన్యూన్‌గా అదే రివ్యూలో చెప్తారని నమ్ముతున్నాను. రివ్యూస్ చూసిన తర్వాత మా సినిమాను చూసేందుకు థియేటర్స్‌కు రండి. సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమా చూసినవారు నచ్చితే తప్పకుండా మీ రెస్పాన్స్‌ని తెలియజేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ సినిమాకు ఎక్కడా గ్రీన్ మ్యాట్ అనేది వాడకుండా.. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ప్రేక్షకులకి గ్రేట్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని చాలా ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. ఈ సినిమా చూసి నేను విజువల్‌గా పెద్ద సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు కల్పిస్తే చాలు. అంతకు మించి ఏం కోరుకోవడం లేదు. ఇందులో అనుపమని మంచి పెర్ఫార్మర్‌గా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు.. ఈ సినిమాలోని అనుపమ వేరు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా విషయాలకు రిలేట్ అవుతారు. తెలుగులో ఈ సినిమా చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతుందని స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!