RGV and Sadaa
ఎంటర్‌టైన్మెంట్

RGV on Dog lovers: డాగ్ లవర్స్‌కు వర్మ 10 ప్రశ్నలు.. సదాకు డైరెక్ట్ కౌంటర్!

RGV on Dog lovers: వీధి కుక్కల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సెలబ్రిటీలు ఎందరో ఫైరవుతున్న విషయం తెలిసిందే. ఈ తీర్పుకు ఎవరైనా వ్యతిరేకించినా, వారిపై చర్చలు తప్పవని కోర్టు ఆర్డర్స్ వేసినా సరే.. అవేమీ పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో.. సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారు. అలా తప్పుబట్టే వారందరికీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సూటిగా 10 ప్రశ్నలు సంధించారు. మరీ ముఖ్యంగా ఆయన సంధించిన ఈ ప్రశ్నలు.. హీరోయిన్ సదా (Heroine Sadaa)కు డైరెక్ట్ కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. రీసెంట్‌గా సదా తన సోషల్ మీడియా వేదికగా.. ఏడుస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో.. ‘ఇప్పుడసలు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. నా ప్రాణం ఎవరో తీస్తున్నట్లుగా ఉంది’ అంటూ సుప్రీం తీర్పును తప్పుబడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక్క సదా అనే కాదు.. సెలబ్రిటీలెందరో ఇదే వంత పాడుతున్నారు. అలాంటి వారందరికీ రామ్ గోపాల్ వర్మ 10 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు మరి వారు సమాధానం ఇస్తారో, లేదో చూడాల్సి ఉంది. ఇంతకీ వర్మ ఏం పోస్ట్ చేశారంటే..

Also Read- Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

సుప్రీంకోర్టు తీర్పుతో హర్టయిన డాగ్ లవర్స్‌కి నేను సంధిస్తున్న 10 ప్రశ్నలివే.. సమాధానం ఉందా?

1. వీధి కుక్కల దాడిలో ప్రజలు చనిపోతున్నారు, తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ కుక్కలను ప్రేమించే వాళ్ళు మాత్రం కుక్కల హక్కుల గురించి సోషల్ మీడియాలో డిస్కస్ చేయటంలో బిజీగా ఉన్నారు.
2. మీరు మీ ఖరీదైన ఇళ్లలో మీ పెంపుడు కుక్కలను ప్రేమించండి.. తప్పులేదు.. కానీ వీధి కుక్కల బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు జాలి గురించి చెప్పడం అమానుషం.
3. ధనవంతులు హైబ్రీడ్ కుక్కలను పెంచుకుంటారు. పేద ప్రజలు మాత్రం వీధి కుక్కల దాడికి గురై చనిపోతున్నారు. కుక్కలను ప్రేమించే వాళ్ళు మాత్రం వీటి గురించి మాట్లాడరు.
4. మనిషి చంపితే అది హత్య. కుక్క చంపితే అది ప్రమాదం. మరి మనుషులు కూడా జంతువుల్లా చంపితే దాన్ని కూడా ప్రమాదం అంటారా?
5. మనుషులు మరణిస్తే ఏడవరు కానీ.. కుక్కల కోసం ఏడుస్తారు. సానుభూతి కూడా ఇంత వివక్షతో ఉంటుందని నాకు తెలీదు.
6. వీధి కుక్కలను చంపొద్దు అని చెప్పే డాగ్ లవర్స్, వాటినన్నింటినీ రోడ్ల మీద నుంచి తీసుకెళ్లి దత్తత ఎందుకు తీసుకోరు? అవి వీధి కుక్కలు కాబట్టి, మురికిగా, వ్యాధులతో ఉంటాయి కాబట్టి.. లేదంటే మీ కుటుంబ సభ్యులకు ప్రమాదం అని భయపడి తీసుకోరా?
7. న్యాయం లేని కరుణ, కరుణ కాదు. అది స్వార్థంతో కూడిన క్రూరత్వం.
8. గేటెడ్‌ కమ్యూనిటీల్లో వీధికుక్కల దాడులు జరగవు. అవి గేట్లు లేని పేదల బస్తీల్లోనే దాడి చేస్తాయి.
9. ఒక తల్లి తన బిడ్డ కుక్కల దాడిలో చనిపోవడం చూస్తుంది. ఆమె కోసం కూడా ఒక హ్యాష్‌ట్యాగ్ ఎందుకు క్రియేట్ చేయరు?
10. ఒక్క కుక్కలకు మాత్రమే కాదు, అన్ని జంతువులకు బ్రతికే హక్కు ఉంది. కానీ ఆ హక్కు మనుషుల ప్రాణాల కంటే గొప్పదా?

Also Read- Constable Kanakam: సడన్‌గా మిస్సవుతున్న అమ్మాయిలు అడవిగుట్టలో ఏం చేస్తున్నారు?.. తెలియాలంటే!

రామ్ గోపాల్ వర్మ సంధించిన ఈ 10 ప్రశ్నలకు నెటిజన్లు కూడా ‘చాలా బాగా చెప్పారు’ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ‘అడగాల్సిన విధంగా అడిగారు.. ఎవరూ మాట్లాడటం లేదని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు’, ‘మొదటి సారిగా మీరు మేధావిగా కాకుండ, సగటు మనిషిగా స్పందిస్తున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మరో ట్వీట్‌లో వర్మ.. ఒక చిన్న పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేస్తున్న వీడియోను షేర్ చేసి, ఆ పిల్లాడి ఫ్యామిలీ ఎంత నరకాన్ని అనుభవిస్తుందో తెలియజేశారు. మొత్తంగా అయితే, వర్మకు చాలా గ్యాప్ తర్వాత మంచి పాయింట్ అయితే దొరికొంది. మరి.. దీనిని ఎంత వరకు తీసుకెళతారో.. వేచి చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు