Jr NTR And Hrithik
ఎంటర్‌టైన్మెంట్

Ayan Mukerji: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణ వల్లే.. ‘వార్ 2’ ఆలస్యం!

Ayan Mukerji: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్2’ (War 2). YRF స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోన్న ఈ ఆరవ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల తారక్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయినటువంటి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా చేయాలని, అలాంటి కథ‌ను సృష్టించేందుకే ఎక్కువ సమయాన్ని వెచ్చించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Also Read- Klinkara Birthday: మెగా ఫ్యాన్స్ కోసం క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన..

ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులెందరో ఇష్టపడిన ‘వార్’ సినిమాకు కొనసాగింపుగా ఈ ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకునేందుకు పడిన కష్టాన్ని, కష్టంగా కాకుండా నా బాధ్యతగా భావిస్తున్నాను. వార్2’ సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడు ఇదే నా తొలి చిత్రం అన్నట్లుగా భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా, మన మార్క్ కనబడేలా చూసుకోవాలి.. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ చేస్తున్నప్పుడు.. దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి నేనేం చేయాలో అది చేసేందుకు పూర్తిగా నిమగ్నమయ్యాను.

Also Read- Sekhar Kammula: నేను ఎంజాయ్ చేయలేదు.. ‘పుష్ప 2’పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ‘వార్2’ చిత్రాన్ని రూపొందించాం. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా.. కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించడం జరిగింది. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్, భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్‌ ఒకచోటికి చేరేలా ‘వార్2’ సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని.. అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తుంటారో, సినిమాపై వారి అంచనాలేంటో నాకు తెలుసు. అలాంటి వారంతా థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేలా ఈ సినిమా ఉండాలనేలా ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా రూపొందించాం. ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేసుకునేలా ‘వార్2’ సినిమా ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ కలయికలో గూజ్ బమ్స్ తెప్పించే సన్నివేశాలతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఈ సినిమా అందిస్తుంది’’ అని తెలిపారు. ‘వార్ 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?