Sekhar Kammula: ‘పుష్ప 2’పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
Sekhar Kammula on Pushpa 2
ఎంటర్‌టైన్‌మెంట్

Sekhar Kammula: నేను ఎంజాయ్ చేయలేదు.. ‘పుష్ప 2’పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

Sekhar Kammula: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). జూన్ 20న ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన టీమ్.. ఇప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూలతో సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లుందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా శేఖర్ కమ్ముల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప 2’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read- PC Meena Reporting: ట్రైలర్ అదిరింది.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సిరీస్ వస్తోంది.. ఓటీటీ ఫ్యాన్స్‌కి పండగే!

‘‘ఈ మధ్య ఆడియెన్స్ అడ్రినలిన్ రష్ ఉన్న చిత్రాలకే కనెక్ట్ అవుతున్నారు. అలాంటి వారిని ఒక సెన్సిబుల్ చిత్రంతో ఎంత వరకు ఆకట్టుకోగలరని అనుకుంటున్నారు? అనే ప్రశ్న ‘కుబేర’ ప్రమోషన్స్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆడియెన్స్‌ టేస్ట్‌లో మార్పు వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఓటీటీల ప్రభావమైతే కాస్త ఉందని నేను చెప్పగలను. ఓటీటీ ఫిల్మ్ ఏది? అసలు ఫిల్మ్ ఏది? అనేది థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఓటీటీల కారణంగా బాగా అండర్‌లైన్ అవుతుంది. స్మూత్ సినిమా అంటే ఒక్కళ్లు కూర్చుని చూసుకునే సినిమా.. అది ఇంట్లో కూర్చుని అయినా చూసుకోవచ్చు అనే భావన ఉండొచ్చు. లౌడ్ మ్యూజిక్ పెడితే కలెక్టివ్ యుఫోరియా ఉంటది కదా.. అది జనరేట్ చేస్తే.. ఇది థియేటర్‌లో చేయాలి. అడ్రినలిన్ రష్ అనేది మనం పెద్ద పెద్ద సినిమాలను చూస్తుంటే భయంకరమైన యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్‌లతో ఉంటుంది. అయితే అవి కూడా రన్ అయేది రెండు వారాలే. కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ థియేటర్లకి వస్తారు. అలా లేదు అంటే ఓటీటీలలో చూడవచ్చని అనుకుంటున్నారేమో. ఇదే నేను గమనించింది. స్కేల్ అనేది కాస్త ఇంపార్టెంట్ అయిందేమో ఓటీటీ వర్సెస్ థియేటర్స్ విషయంలో.

Also Read- King Nagarjuna: ‘కుబేర’తో పాటు నాగ్ చెప్పిన 100వ సినిమా, ‘శివ 4కె’, ‘కూలీ’ విశేషాలివే..

ఒక గొప్ప సినిమా చిన్నదా? పెద్దదా? అని కాదు.. మనసు పెట్టి సినిమా తీస్తే ఇంకా ఆడియెన్స్ థియేటర్లకి వచ్చి చూసేవాళ్లు ఉన్నారు. అది పోదు.. అది పోయినరోజు ఇంకేం ఉండదు. సినిమా చచ్చిపోయినట్టే. అడ్రినలిన్ రష్ ఉంటే సినిమాను నేను అంతగా ఇష్టపడను. ‘పుష్ప 2’ (Pushpa 2) చూశాను. అది జనంతో వెళ్లిపోయింది. పర్సనల్‌గా అయితే నేను అలాంటి సినిమాలతో ఎంజాయ్ చేయలేను. ఒక ఫిల్మ్ మేకర్‌గా నేను అలాంటి సినిమాలు తీయగలనా? అని అనుకుంటే మాత్రం కచ్చితంగా తీయలేను. అరే.. భలే తీశారే అని అనుకుంటాను. కానీ దానిని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తానా? అంటే మాత్రం చేయలేను. కానీ అలా తీసే వాళ్లకి మాత్రం గొప్ప టాలెంట్ ఉందని భావిస్తాను. నేను అయితే అలా తీయలేను. కానీ దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది..’’ అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​