PC Meena Reporting: భారతదేశపు టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో జీ5 కూడా ఒకటి. తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem: PC Meena Reporting) అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ (Poluru Krishna) దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27న ZEE5 ఒరిజినల్ సిరీస్‌గా ప్రీమియర్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సిరీస్ ట్రైలర్‌ను నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈ సిరీస్‌పై బీభత్సంగా అంచనాలను పెంచేస్తుంది.
ట్రైలర్ విడుదల అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్ సిరీస్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. ‘రెక్కీ’ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. అభిజ్ఞ, చరణ్ ఇందులో అద్భుతంగా నటించారనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. దివ్య వంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. జూన్ 27న జీ5లోకి రాబోతోన్న ఈ సిరీస్‌తో ఈ టీమ్‌కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Also Read- Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?
‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్ ట్రైలర్ విషయానికి వస్తే.. విరాటపాలెం గ్రామానికి ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే.. మరుసటి రోజే పెళ్లి కూతురు చనిపోతుంటుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి ఒక లేడీ కానిస్టేబుల్ మీనా (అభి) వస్తుంది. ఆ ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, ఆ ఊరి రహస్యాల్ని పటా పంచెలు చేయడానికి పెళ్లికి రెడీ అవుతుంది మీనా. ఆ గ్రామ ప్రజలు భయపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోలీస్ కానిస్టేబుల్ మీనా నిజాల్ని ఊరి ప్రజలకు తెలిసేలా చేసిందా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా అంచనాలు పెంచేసేదిగా ఉంది.
Also Read- Famous Temple: మెగాస్టార్ ధ్యానం చేసిన ఆలయం.. అమరావతికి దగ్గరలోనే!
ఈ సిరీస్‌లో ఉన్న వాతావరణం గమనిస్తే.. 80వ దశకానికి చెందినట్టుగా కనిపిస్తోంది. నటీనటుల కట్టూ బొట్టూ, మాట తీరు, విజువల్స్ అన్నీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తున్నాయి. మ్యూజిక్, విజువల్స్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాయనేది ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎటువంటి వల్గారిటీ లేని ఈ సిరీస్‌ను కుటుంబ సమేతంగా చూడొచ్చని జీ5 టీమ్ ప్రకటించింది. చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించిన ఈ సిరీస్‌కు దివ్య తేజస్వి పెరా కథను, విక్రమ్ కుమార్ కండిమల్ల స్క్రీన్‌ప్లేని అందించారు. రోహిత్ కుమార్ నేపథ్య సంగీతం, మహేష్ కె స్వరూప్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు. జూన్ 27 నుంచి ZEE5లో ఈ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ప్రీమియర్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు