Klinkara Birthday ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Klinkara Birthday: మెగా ఫ్యాన్స్ కోసం.. క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన

Klinkara Birthday: తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జోడీ ఒకటి. రామ్ చరణ్, ఉపాసనను ముద్దుగా ‘ఉప్సి’(upsi) అని పిలుస్తాడు. ఇక వీరి మధ్య ఉండే బాండింగ్‌ చూసి సినీ లవర్స్ తో పాటు అభిమానులు కూడా ఫిదా అయిపోతుంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఉంటుంది ఈ జంట. ఓ వైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండగా,  ఉపాసన తన వ్యాపార పనుల్లో బిజీగా ఉంటూనే ఇంట్లో అత్త, అమ్మమ్మలతో సరదా వీడియోలు చేస్తుంటుంది. అత్తమ్మ కిచెన్ అంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తూ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది.

ఫేస్ రివీల్ అప్పుడే..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన, ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, ఇంత వరకు మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్‌ను అభిమానులకు చూపించలేదు. ఉపాసన, రామ్ చరణ్  తమ కూతురి ఫేస్‌ను రివీల్ చేయడం లేదు. పబ్లిక్ లోకి వస్తే ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ, తనను నాన్న అని క్లీంకార ఎప్పుడైతే పిలుస్తుందో అప్పుడే ఫేస్ రివీల్ చేస్తానని చెప్పాడు.

Also Read: Abhishek Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. సింగిల్ గా ఉండాలనిపిస్తోందంటూ అభిషేక్ బచ్చన్ పోస్ట్?

మెగా ప్రిన్సెస్ ను చూశారా? 

జూన్ 20 (శుక్రవారం) క్లింకార పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఉపాసన తన కూతురుకు సంబంధించి ఫొటోను పోస్ట్ చేసి విషెస్ తెలిపింది. అందులో ఒక సైడ్ నుంచి మాత్రమే క్లీంకార ఫేస్ కనిపిస్తున్నది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

ఆడపులికి క్లీంకార పేరు

మరోవైపు, క్లీంకార బర్త్ డే సందర్భంగా ఉపాసన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.  హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌‌లోని ఒక ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని చెబుతూ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌‌ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

గతేడాది జూ పార్క్‌కు వెళ్లిన క్లీంకార

గతేడాది హైదరాబాద్ జూ పార్క్‌కు వెళ్లిన సమయంలో, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార నవజాత తెల్ల పులి పిల్లను చూశారు. ఆ ప్రత్యేక క్షణానికి గుర్తుగా జూ అధికారులు ఆ పులి పిల్లకి క్లీంకార అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీకి తెలియజేశారు. ఉపాసన, రామ్ చరణ్ జంతు ప్రేమికులు. ఈ నేపథ్యంలోనే జూ పార్క్ అధికారులు వారు జీవుల పట్ల చూపించే ప్రేమకు చిహ్నంగా ఇలా చేస్తామని తెలిపారు.

పులి పిల్లను చూసి సంబురపడ్డ క్లీంకార

తన రెండో పుట్టినరోజు సందర్భంగా, క్లీంకార మొదటిసారిగా తన పేరును కలిగి ఉన్న తెల్ల పులిని ప్రత్యక్షంగా చూసి సంబురపడింది. తెల్లగా ఉన్న పులిని క్లీంకార మైమరచి చూడటాన్ని చూసి అందరూ సంబురపడ్డారు. రామ్ చరణ్, ఉపాసన శుక్రవారం నుంచి అధికారికంగా ఆ పులిని దత్తత తీసుకున్నారు.

Also Read: Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!