VV Vinayak: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘దేఖ్‌లేంగే సాలా’ (Dekhlenge Saala) అనే పాట విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, ఇన్‌స్టెంట్ హిట్‌గా నిలిచింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, సంగీత ప్రియుల ప్రశంసలను అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ కూడా భారీగా ప్రశంసలను అందుకుంటోంది. అద్భుతమైన సాహిత్యంతో భాస్కరభట్ల పాట సక్సెస్‌లో భాగమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ కనువిందు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read- Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!
ఫొటో వైరల్
ఆ వార్త ఏంటంటే.. ఈ మధ్య మాస్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలు నిజం కాలేదు. ప్రయత్నాలైతే జరిగాయి కానీ, ఏమైందో ఏమో.. చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి వినాయక్ అస్సలు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. తాజాగా ఆయన హరీష్ శంకర్‌తో కలిసి కనిపించారు. ‘దేఖ్‌లేంగే సాలా’ పాట తనకు ఎంతగానో నచ్చడంతో హరీష్‌ను అభినందించినట్లుగా తెలుపుతూ మేకర్స్ ఈ ఫొటోని రిలీజ్ చేశారు. అంతేకాదు, దీనిపై ఓ స్పెషల్ వీడియో కూడా రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత హరీష్, వినాయక్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read- S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్
వినాయక్ కల నెరవేరినట్టే..
ఇక ఈ ఫొటో వచ్చినప్పటి నుంచి.. ‘శీనయ్య’తో కానిది ‘ఉస్తాద్’తో అయిందంటూ వార్తలు మొదలయ్యాయి. అదేంటంటే.. వివి వినాయక్ యాక్టర్‌గా ఇందులో ఓ కీలక పాత్రను పోషించాడట. ఆ విషయం తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారనేలా టాక్ మొదలైంది. ఇందులో వినాయక్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని, అందరూ ఆ పాత్రతో సర్‌ప్రైజ్ అవుతారని అంటున్నారు. వాస్తవానికి ‘శీనయ్య’ సినిమాతో నటుడిగా వినాయక్ ఎంట్రీ ఇవ్వాలని చూశారు. కొంతమేరకు షూటింగ్ కూడా చేశారు. కానీ అది వర్కవుట్ కాదని భావించి, పక్కన పెట్టేయడంతో, నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న వినాయక్ ఆశలు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు ‘ఉస్తాద్’లో కనుక వినాయక్ నటించి ఉంటే మాత్రం.. హరీష్ ఆయన కలను నిజం చేశాడనే చెప్పుకోవాలి. చూద్దాం మరి, దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

