Bigg Boss Buzzz: తెలుగు రియాలిటీ షో అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించిన ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu) హౌస్ నుండి తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, నటుడు సుమన్ శెట్టి, తన ఇంటి ప్రయాణంపై, ఇంటిలో ఉన్న హౌస్‌మేట్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్ నుంచి ఎలిమినేటైన అనంతరం శివాజీతో ఆయన ‘బిగ్ బాస్ బజ్’ (Bigg Boss Buzzz) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా టీమ్ విడుదల చేసింది. ఇందులో తన అనుభవాలను, ఆశలను పంచుకున్నారు సుమన్ శెట్టి (Suman Shetty). ఈ ప్రయాణంపై శివాజీ (Sivaji) చేసిన విశ్లేషణ, ముఖ్యంగా నటుడు సుమన్ ఆట తీరుపై అభిప్రాయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read- Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు
అబద్దం చెప్పమన్నా చెప్పను
శనివారం ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చిన సుమన్ శెట్టి, తమ ప్రయాణం ఊహించని విధంగా ముగిసిందని తెలిపారు. ‘‘ప్రతి వారం నామినేషన్స్ నాకు ఒక పాఠం నేర్పాయి. ఆరంభంలో కొంత ఒత్తిడికి లోనైనా, ఆ తర్వాత నా సహజమైన ఆటను ఆడేందుకు ప్రయత్నించాను. హౌస్‌లో నాకు కొన్ని మంచి అనుబంధాలు దొరికాయి, కొన్ని కష్టాలూ ఎదురయ్యాయి’’ అని సుమన్ తన అనుభవాలను పంచుకున్నారు. సుమన్ అన్నాయ్.. అంటూ పిలవడంతోనే శివాజీ నవ్వులు పూయించారు. అధ్యక్షా.. బజ్‌లో ఏ ప్రశ్న అడిగినా అంటూ సుమన్ శెట్టితో ప్రమాణం చేయిస్తున్నారు. అబద్దం చెప్పమన్నా చెప్పను అంటూ సుమన్ శెట్టి ప్రమాణం చేస్తుంటే చూసి శివాజీ షాకయ్యారు. ఆ తర్వాత కళ్యాణ్, ఇమ్ములను బ్యాంకాక్ తీసుకెళతానని మాట ఇచ్చావంటకదా.. అని అనగానే సుమన్ శెట్టి.. ‘అన్నా ఆ ప్రశ్నలు వద్దు.. వదిలెయ్ అన్నా’ అంటూ నవ్వుకుంటున్నారు.
Also Read- Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది
ఎవరు చేయకూడని తప్పు చేశావ్..
అసలీ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? అని శివాజీ అడగగానే.. ‘లేదు అన్నా’ అని సుమన్ శెట్టి సమాధానమిచ్చారు. ‘మేము కూడా అదే అనుకున్నాం’ అంటూ శివాజీ అనగానే సుమన్ శెట్టి అవాక్కయ్యాడు. ‘మేము కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశాం. అసలు సంజన పేరు చెబితే ఫేస్ మొత్తం మారిపోయేది తెలుసా? కానీ ఒక మాట అన్నావ్.. వస్తుందయ్యా, రంగులు మార్చే ఊసరవెల్లి’ అని శివాజీ అనగానే సుమన్ శెట్టి ఒక్కసారిగా షాకయ్యాడు. ‘ఎందుకు నీ పిలకను భరణి చేతిలో పెట్టావ్? నీకెందుకు ఆయనతోటి.. నీ ఐడియా నీకు ఉండదా?’ అని శివాజీ అడిగిన ప్రశ్నకు సుమన్ శెట్టి ఏదో సమాధానమిస్తున్నారు. ‘కానీ, చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్.. ఎవరు చేయకూడని తప్పు చేశావ్ నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో. ఎందుకు చేశావ్ అలా?’ అని అనగానే ఒక్కసారిగా సుమన్ శెట్టి ఫేస్‌లో భయం కనిపించింది. ‘ఆ తప్పు ఏంటో చెబితే చెబుతా?’ అంటూ సుమన్ అడుగుతున్నాడు. ‘బాత్రూమ్ దగ్గర.. ఆలోచించవా ఏమి? ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తావా?’ అంటూ శివాజీ క్లాస్ ఇస్తున్నాడు. మొత్తంగా అయితే.. ఈ బజ్‌పై ఈ ప్రోమోతో బజ్ క్రియేట్ చేశారు. చూద్దాం.. ఫుట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

