Bandla Ganesh: యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా నటించిన తాజా చిత్రం ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 12న ప్రీమియర్స్‌తో మొదలైన ఈ సినిమా, డిసెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలంతా.. సినిమాపై వారి రివ్యూలను ఇస్తూ, చిత్ర టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) సోషల్ మీడియా వేదికగా తన రివ్యూని ఇచ్చారు. ముఖ్యంగా ఈ రివ్యూలో ఆయన ప్రస్తావించిన విషయాలపై నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా రివ్యూ ఇవ్వవచ్చా? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇంతకీ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఏంటంటే..
Also Read- Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది
రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు
“వైల్డ్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్ చూశాక అనుకున్నా… పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని. కానీ సినిమా చూశాక అర్థమైంది, పోస్టర్ ఇంకా సాఫ్ట్‌గా ఉందని! ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్‌లో అనుకున్నా… కాని స్క్రీన్ మీద చూసాక అర్థమైంది, రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు. ఇది అతని రెండో సినిమా. సందీప్ రాజ్ రైటింగ్.. మాటల్లో సింప్లిసిటీ, సీన్స్‌లో క్లారిటీ! బండి సరోజ్ విలనిజం విలన్ కదా అని ఎక్కువ చేయలేదు, అదే ఎక్కువ అయింది! సాక్షి అమాయకత్వం సినిమాకి చక్కని బ్యాలెన్స్! కాల భైరవ మ్యూజిక్ సీన్‌కి అవసరమైన చోటే వచ్చి పని చేసింది!! విశ్వప్రసాద్ సినిమా టేస్ట్.. టేస్ట్ అంటే ఇదే అని మళ్లీ గుర్తు చేశారు! మొత్తానికి, మోగ్లీ సినిమా చూశాక ‘వైల్డ్’ అనే మాటకి అర్థం అప్‌డేట్ అయింది. కంగ్రాట్స్ టీమ్ మోగ్లీ.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి… మనం థియేటర్‌లో నవ్వుతూ బయటకి రావాలి’’.. ఇది బండ్ల గణేష్ ఇచ్చిన రివ్యూ.
Also Read- Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది
మీరు మారిపోయారు సార్
అయితే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ చిన్న సినిమాలపై చాలా యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ టైమ్‌లో కూడా స్టేజ్‌పై ఆయన మాట్లాడిన మాటలు కాంట్రవర్సీగా మారాయి. కానీ, ఈసారి బ్యాలెన్స్ తప్పకుండా, కేవలం సినిమా గురించే మాట్లాడటం విశేషం. బండ్ల గణేష్ అనగానే.. ఆయన ఏం చేసినా వెనుక ఏదో అర్థం ఉందనేలా ఆయన ట్వీట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైమ్ చాలా క్లారిటీగా సినిమా గురించే ప్రస్తావించడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ‘మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. మా బాలయ్య సినిమాపై కూడా రివ్యూ ఇవ్వవచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#Mowgli 🔥
“వైల్డ్ బ్లాక్‌బస్టర్” ట్యాగ్ చూశాక అనుకున్నా…
పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని 😜
కానీ సినిమా చూసాక అర్థమైంది ,పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని!ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్నా…
కాని స్క్రీన్ మీద చూసాక అర్థమైంది ,Roshan…— BANDLA GANESH. (@ganeshbandla) December 13, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

