Itlu Arjuna: రీసెంట్‌గా ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ అనే ట్యాగ్ ఎలా వైరలైందో తెలియంది కాదు. ఆ గయ్ ఎవరనేది? ఎవరికీ తెలియలేదు. ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అనేలా ఎగ్జయిట్‌మెంట్ ఏర్పడేలా చేయడంలో మ్యూజిక్ సంచలన థమన్ కూడా భాగమయ్యారు. ఇప్పుడా గయ్ ఎవరో తెలిసిపోయింది. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ తన తొలి ప్రొడక్షన్‌ను ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna) అనే టైటిల్‌తో ప్రారంభించింది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల (Venky Kudumula), కంటెంట్ బేస్డ్ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా ఇప్పుడు కొత్త జర్నీని స్టార్ట్ చేశారు. నూతన దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వంలో ఆయన మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించే ఇటీవల పై ట్యాగ్ వైరల్ అయింది. ఈ ట్యాగ్‌లో ప్రకారం ఆ హీరో ఎవరో కాదు.. అనిష్. నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడు అనిష్ (Aniesh) హీరోగా పరిచయమవుతోన్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘ఇట్లు అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. ‘సోల్ ఆఫ్ అర్జున’ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ మూవీ వరల్డ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. గ్లింప్స్‌ని గమనిస్తే..
Also Read- Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!
న్యూ గయ్ ఇన్ టౌన్ ఎవరో తెలిసిపోయింది..
ఈ గ్లింప్స్ కింగ్ నాగార్జున అందించిన మ్యాజికల్ వాయిస్ ఓవర్‌తో ఎంతో ప్రశాంతంగా, కవిత్వాత్మకంగా ఉందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రేమలోని స్వచ్ఛతను, లోతును ఆయన మాటలు గొప్పగా ఆవిష్కరించాయి. ఆ వర్ణనలోనే అర్జునని పరిచయం చేశారు. అర్జున మాట్లాడలేడు, కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు, అతని ఎమోషన్స్‌ను తగ్గించదు. అతని ధైర్యం, బలం ఈ టీజర్‌లో ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. డెబ్యూ హీరోగా అనీష్ ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ప్రతి ఫేమ్‌లో ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. డైలాగ్స్‌కు ఆస్కారం తక్కువగా ఉండే పాత్రలో భావ వ్యక్తీకరణ, బాడీ లాంగ్వేజ్‌తోనే కథను మోయడం ఎంత కష్టమో తెలియంది కాదు. కానీ, ఈ గ్లింప్స్‌లో అది ఎక్కడా కనిపించకుండా చేయడం మాత్రం ప్రశంసనీయం. కళ్లలో కనిపించే ఇంటన్సిటీ అతన్ని పూర్తి హీరో మెటీరియల్‌గా నిలబెడుతోంది. సాహసోపేతమైన జంప్స్, రా ఫిజికాలిటీతో కూడిన యాక్షన్ షాట్స్ వావ్ అనేలా ఉన్నాయి.
Also Read- Ustaad BhagatSingh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిమేక్ కాదా?.. మరి హరీష్ శంకర్ తీసింది ఏంటి?
గ్లింప్స్‌కు మెయిన్ హైలైట్ ఇదే..
అనిష్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ఫ్రేమ్‌కు తాజాదనాన్ని తీసుకొస్తుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తూ, గ్లింప్స్‌లోనే కథ భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయానికి చేరువ చేస్తుండటం విశేషం. నాగార్జున మ్యాజికల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు మెయిన్ హైలైట్. టెక్నికల్‌గా కూడా ఈ గ్లింప్స్ టాప్ క్లాస్‌లో వుంది. రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ ప్రేమ, యాక్షన్‌లను పాలిష్డ్ విజువల్ డిజైన్‌ని పరిచయం చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫ్రేమ్స్ రిచ్‌గా, కేర్‌తో కంపోజ్ చేసినట్టుగా కనిపించాయి. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేస్తోంది. గ్లింప్స్ ప్రధానంగా ఎమోషన్స్, రొమాన్స్‌పై ఫోకస్ చేసినప్పటికీ.. యాక్షన్, డ్రామాకు సంబంధించిన అండర్‌కరెంట్‌ను కూడా తెలియజేస్తుంది. త్వరలోనే చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను చిత్రయూనిట్ తెలియజేయనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

