S Thaman: ‘ప్రాబ్లమ్ వస్తే బ్యాండేజ్ వేయండి కానీ, పక్కన ఉండి బ్యాండ్ వాయించకండి’ అని అన్నారు సంగీత దర్శకుడు థమన్ (S Thaman). తాజాగా జరిగిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్‌లో చిత్ర నిర్మాతలకు సపోర్ట్ ఇస్తూ.. థమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి అవాంతరాలను ఫేస్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకే డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలైంది. ఒక వారం పాటు ఈ సినిమాపై రకరకాలుగా కామెంట్స్ పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటను టార్గెట్ చేస్తూ నందమూరి అభిమానులు భారీగా ట్రోలింగ్ చేశారు. దీనిపై థమన్ ఇండస్ట్రీలో యూనిటీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
శివుని ఆజ్ఞతోనే ఇదంతా..
అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమాలు చేస్తే ఒక ధైర్యం వస్తుంది. చాలా ప్యూరిటీ వస్తుంది. ‘అఖండ’ గ్రేడ్ జర్నీ. బాలయ్య ప్రతి సినిమా ఒక పరీక్షే. ఎలా కొత్తగా చేయాలా అనే తపన ఉంటుంది. ఈ సినిమాకు లిరిక్ రైటర్స్ అద్భుతమైన సాహిత్యం రాశారు. ‘అఖండ’ వంటి సినిమాకు మ్యూజిక్ చేయడం ఒక ఛాలెంజ్. మా సింగర్స్ అందరు కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సంతోష్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మైనస్ డిగ్రీల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. శివుని ఆజ్ఞతో ఇదంతా జరిగిందని భావిస్తున్నాను. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సులు బద్దలవుతాయని నమ్మకం మాకుంది. అదే రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. బాలయ్యతో ఐదు సినిమాలు చేస్తూ.. ఐదు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాము. చాలా ఆనందంగా ఉంది. గోపీచంద్‌తో మరో సినిమా స్టార్ట్ చేశాం. అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది.
Also Read- Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!
లాస్ట్ మినిట్ లో వచ్చి ఆపారు
సినిమా విడుదలకు ముందు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. డిసెంబర్ 5 సినిమా రిలీజ్ అని తెలిసి కూడా రిలీజ్‌కు ముందే అడ్డుపడ్డారు. అప్పుడే కదా ఏమైనా చేయగలమనేది వారి ఉద్దేశం. డిసెంబర్ 4 సాయంత్రం సినిమా పడే ముందు.. కరెక్ట్‌గా లాస్ట్ మినిట్ లో వచ్చి ఆపారు. ఇదే చెబుతుంది.. ఎంత యూనిటీ లేకుండా ఉంది ప్రపంచం అనేది. ఇక్కడ అంతా మనమే.. నాదే అన్నట్లు ఉంది. కానీ, మనం అన్నదాంట్లోనే అందరం ఉంటాం. మనది, మనం అనుకుంటే.. మనం పెరుగుతామే తప్ప తగ్గిపోము. ఛానెల్స్‌కు వెళ్లి రామ్ మంచివాడు, గోపీ మంచివాడు అని సలహాలు ఇస్తున్నారు తప్పితే.. ఒక్కరైనా ప్రొడక్షన్ ఆఫీస్‌కి వచ్చి ధైర్యం చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నిర్మాతలకి ఇంకా బలం వచ్చేది. అలా చెప్పలేని వాళ్లు.. ఛానల్స్‌లో కూర్చుని తప్పుగా మాట్లాడడం ఎందుకు..? ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. నాలుగు గోడల మధ్య జరిగేది.. ప్రపంచమంతా చాలా బ్యాడ్‌గా వెళ్తుందని తెలుసుకోలేకపోతున్నారు.
Also Read- Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది
బ్యాండేజ్ వేయండి.. బ్యాండ్ వాయించకండి
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే అందరి చూపు ఉంది. ఇక్కడలాంటి ఫ్యాన్స్ ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనూ లేరు. ఇక్కడ ఉన్నంతమంది హీరోలు వేరే ఏ లాంగ్వేజ్‌లో లేరు. ఇప్పుడు అంతా టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్‌కి దిష్టి తగిలింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒకరిని ఒకరు తిట్టుకోవడమే. ఇకనైనా యూనిటీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా నా సినిమానే అనుకోవాలి. నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండి.. అంతే కానీ, బ్యాండ్ వాయించకండి. అఖండ 2 విడుదల వాయిదా అనేది నిర్మాతల కంట్రోల్‌లో లేకుండా జరిగిపోయింది. కావాలని ఎవరూ తమ సినిమాను వాయిదా వేయరు కదా. దేవుడు దర్శనం ఈరోజు అవకపోతే.. ఒక వారం లేటుగా అవుతుంది. ఎప్పుడు ఈ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం మా అందరిలో ఉంది. అదే ఇప్పుడు నిజమైంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

