VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ VT15 టైటిల్, టైటిల్ గ్లింప్స్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ ఎక్జైట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే(జనవరి 19)ను పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ వదిలారు. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ ఎప్పుడో లీకైంది. ఆ టైటిల్‌నే ఇప్పుడు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటని అనుకుంటున్నారా? ‘కొరియన్ కనకరాజు’. ఇక టైటిల్‌తో పాటు వచ్చిన గ్లింప్స్ (Korean Kanakaraju Title Glimpse) మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కెరీర్‌లో లేని విధంగా చాలా స్పెషల్‌గా ఈ సినిమా ఉండబోతుందనే విషయం ఈ టైటిల్ గ్లింప్స్ తెలియజేస్తుంది. టైటిల్ గ్లింప్స్‌ని గమనిస్తే..
Also Read- Chiranjeevi MSG: మన ప్రసాద్ గారు ఫస్ట్ వీకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారోచ్.. వివరాలివే!
కనకరాజు ఎంట్రీ.. కేక
గ్లింప్స్ మొదలవ్వగానే కొరియన్ పోలీస్ ఆఫీసర్స్.. కమెడియన్ సత్యని పట్టుకుని చితక్కొడుతుంటారు. వాళ్ల భాష అర్థం కాక, ఎందుకు కొడుతున్నారో చెప్పండి? లేదా కనీసం సబ్ టైటిల్స్ అయినా వేయండి అంటూ సత్య, ఈ సన్నివేశంలో కూడా కామెడీ పుట్టిస్తున్నారు. సత్య తన గురించి చెబుతుంటే.. ఇంకాస్త ఎక్కువగా తగిలిస్తున్నారు. ఇక వాళ్లు చెప్పేది అతనికి అర్థం కావడం లేదని గమనించిన పోలీసులు హీరోయిన్ రితికా నాయక్ (Ritika Nayak)ను పిలిపిస్తారు. ‘ఎందుకు నన్ను కొడుతున్నారు.. అసలు ఏంటి వీరి బాధ?’ అంటూ రితికాకు సత్య తన బాధను చెప్పగా.. ‘కనకరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటున్నారు’ అని రితికా చెబుతుంది. ‘మనం యాడ ఉన్నామో మనకే తెలియదు.. ఇంక కనకరాజు యాడ ఉన్నాడో చెప్పమంటే ఇంకేం చెప్పేది’ అని అనగానే.. ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. కనకరాజు పోలీసు స్టేషన్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఆ ఐకానిక్ డేట్‌కేనా రిలీజ్?
వీడు మన కనకరాజు కాదు
స్టేషన్‌లోకి వచ్చిన కనకరాజు.. అక్కడున్న పోలీసువాళ్లందరినీ నరికేస్తాడు. ఆఫీసర్ టేబుల్‌పై కూర్చుని.. ‘ఐమామ్ బ్యాక్’ అని గంభీరంగా నవ్వుతుంటే.. వెంటనే సత్య.. ‘వీడు మన కనకరాజు కాదు అమ్మీ’ అని చెబుతాడు. మరి.. అని హీరోయిన్ అనగానే.. టైటిల్ పడుతుంది చూడు అని సత్య చెప్పగానే.. గ్రాండ్‌గా టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్‌లోనే ఓ మిస్టరీ ఉన్నట్లుగా కూడా ఓ అద్భుతదీపాన్ని చూపించడం హైలెట్‌గా ఉంది. సాంకేతికంగా కూడా ఈ గ్లింప్స్ వావ్ అనేలా ఉంది. మొత్తంగా చూస్తే.. హిట్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్‌కు కచ్చితంగా ఈ సినిమా హిట్ ఇస్తుందనే ఫీల్‌ని ఈ టైటిల్ గ్లింప్స్ ఇచ్చేస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సమ్మర్‌కు ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

