Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘భోళాశంకర్’ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా పోయిన ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కోసం చిరంజీవి అండ్ టీమ్ పెద్ద మనసుతో తన సినిమాను వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటి నుండి ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మధ్యలో గ్రాఫిక్స్ పనుల ఆలస్యం, బిజినెస్ పరమైన ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ ఆడుతున్న తీరు చూస్తుంటే, చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హిట్టవ్వడంతో, ‘విశ్వంభర’కు మళ్ళీ లైన్ క్లియర్ అయ్యినట్లుగా తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న గ్రాఫిక్స్ పనులను వేగవంతం చేసి, సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట.
Also Read- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!
ఆ ఐకానిక్ డేట్‌కే రిలీజ్..
లేటెస్ట్ టాక్ ప్రకారం, ‘విశ్వంభర’ను మే 9, 2026న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ వరకు ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు క్యూలో ఉండటంతో, మే 9 సరైన సమయమని టీమ్ భావిస్తోందట. అయితే ఈ డేట్ వెనుక ఒక భారీ మెగా సెంటిమెంట్ దాగి ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా సరిగ్గా మే 9నే విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ సినిమా కూడా సోషియో ఫాంటసీ జోనర్ కావడం, ఇప్పుడు ‘విశ్వంభర’ కూడా అదే జోనర్ కావడం గమనార్హం. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘గ్యాంగ్ లీడర్’ కూడా ఇదే తేదీన విడుదలైంది. దీంతో మే 9న ‘విశ్వంభర’ వస్తే సంచలనం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read- Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!
విజువల్ గ్రాండియర్
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. 4,800కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఈ విజువల్ గ్రాండియర్‌ను యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి ఈ మే 9న మెగాస్టార్ మళ్ళీ తన పాత రికార్డులను తానే బద్దలు కొడతారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ‘మన శంకర వర ప్రసాద్ గారు’గా వచ్చి బాక్సాఫీస్‌ని బాసు రఫ్ఫాడించేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమ బ్రేకీవెన్ సాధించి లాభాల బాటలో నడుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

