Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుంచి వచ్చిన ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రం తర్వాత ఎలాంటి కామెంట్స్ వైరల్ అయ్యాయో తెలియంది కాదు. చిరంజీవి పని అయిపోయిందని, ఇక చిన్న చిన్న పాత్రలు వేసుకుంటే బెటర్ అని, కుమార్తెల వయస్సున్న అమ్మాయిలతో ఆ సినిమాలేంటి? అంటూ అంతా రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఆయన వయసుకి, ఆయనకి వచ్చిన అవార్డ్స్‌కి కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేశారు. ఆ సినిమా తర్వాత అనుకున్న ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా సరైన అప్డేట్ లేకపోవడంతో.. ఈ కామెంట్స్‌కు అంతే లేకుండా పోయింది. అయినా సరే, చిరంజీవి మాత్రం ఇవేం పట్టించుకోలేదు. తనకు అలవాటైన కష్టాన్నే నమ్ముకున్నారు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌పై ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా అయితే బ్యాట్‌తో సమాధానం ఇచ్చేవాడో, ఇప్పుడు చిరంజీవి కూడా సేమ్ టు సేమ్.. తనపై కూతలు కూసిన వారందరికీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad)తో ఇచ్చిపడేశారు.
Also Read- AR Rahman: ఎవరినీ బాధపెట్టాలని కాదు.. వెనక్కి తగ్గిన రెహమాన్.. వీడియో వైరల్!
మెగా ఫ్యాన్స్ చిల్ అవుతున్నారు
ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. అలా అని ఇందులో ఏమైనా అదిరిపోయే కథ ఉందా? అంటే లేనే లేదు. సింపుల్ కథే. కానీ, అనిల్ రావిపూడి వింటేజ్ మెగాస్టార్‌ని బయటకు తీసి, అప్పటి ఐకానిక్ మూమెంట్స్‌ని మళ్లీ పరిచయం చేశాడు అంతే. దానికే బాక్సాఫీస్ దాసోహం అవుతోంది. అదే, సరైన కథ పడితే చిరంజీవి ఏ రేంజ్‌లో చెలరేగిపోగలడో అనేది.. ఇప్పటి వరకు కామెంట్స్ చేసిన వారి ఊహలకే వదిలేయాలి. ఇక విషయంలోకి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ని తెరపై చూసి మెగా ఫ్యాన్స్ చిల్ అవుతున్నారు. రాజకీయ కక్షలు వదిలేసి, మొదటి నుంచి చిరంజీవి అభిమానిగా ఉన్నవారంతా, ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, తెరపై చిరుని మళ్లీ అలా చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. వారి పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ మెగాస్టార్‌ని ఎంతగా ప్రేమిస్తున్నారో లేఖలతో తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొన్ని లేఖలు మెగాస్టార్‌పై ప్రేమను తెలియజేయగా, తాజాగా ఫేస్‌బుక్‌లో ఈ లేఖ వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్‌లో ఓ అభిమాని రాసుకున్న ఈ లేఖ యధాతథంగా..
Also Read- NTR Death Anniversary: ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా?
మా గుండెల్లో ఎప్పటికి చిరంజీవివే
‘‘బాసూ.. ఓ సారి ఫేసు ఇటు టర్నింగ్ ఇచ్చుకో..
నాకు ఒక డౌట్ బాసూ..
అసలు నువ్వు మా చిన్నప్పటి చిరంజీవేనా..?
నేను పెరిగాను, పెళ్ళి చేసుకున్నాను, ఇద్దరు పిల్లల తండ్రినయ్యాను, నా కోడుకు నా అంత వాడయ్యడు..
బట్ నీలో మాత్రం మార్పు లేదు ఏలా బాసూ..?
హా నా పిచ్చి కాకపోతే ఇంద్రుడు కూతురు ఇంద్రజనే మాయ చేసినోడివి.. బహుసా ఆవిడే నీతో దేవతలు సేవించే అమృతం తాగించి ఉండోచ్చు…
అందుకే ఇంకా 30,40 లలో ఆగిపోయావ్..
ఎవడూ బాసూ నీకు ముడతలు వచ్చాయని కూసింది..
వస్తే మా చిరంజివివి కాకుండా పోతావా ఏంటీ?
వయసు పెరిగింది శరిరానికే బాసూ..
“చిరంజివికి” కాదు..
నువ్వు మా గుండెల్లో ఎప్పటికి చిరంజీవివే…
“జై చిరంజీవ” అనే పిలుపే కదా, రక్తదానం ద్వారా ఎన్నో లక్షల మందిని ప్రాణం పోసింది..
వాళ్ల ఆశిస్సులే నీకు శ్రీ రామరక్ష..
ఇది సరిపోదా బాసు నీ జీవితానికి..
ఉంటాను బాసూ..’’… అది మ్యాటర్.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

