Chiranjeevi MSG: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం ఏడు రోజుల్లోనే (MSG First Week WW Collections) కనీవినీ ఎరుగని వసూళ్లను సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగించుకుంది. ప్రీమియర్స్‌తో నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ మొదటి వీక్ ముగిసే సమయానికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఆ ఐకానిక్ డేట్‌కేనా రిలీజ్?
బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లో దాదాపు 292 ప్లస్ కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. వీక్ డే అయిన మండే కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో.. సునాయాసంగా రూ.300 కోట్ల మైలురాయిని బీట్ చేసే అవకాశముందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందీ చిత్రం. సండే (జనవరి 18) ఒక్కరోజే 31 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ వసూళ్లతో అనిల్ రావిపూడి గత చిత్రం ‘సంక్రాంతికీ వస్తున్నాం’ రికార్డులను అధిగమించి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. అలాగే మెగాస్టార్ కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ హిట్ చిత్రం దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది.
Also Read- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!
ఓవర్సీస్‌లోనూ మెగా హవా
కేవలం ఇండియా వైడ్‌గానే కాకుండా.. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిరంజీవి గత చిత్రాల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఇప్పటివరకు 2.96 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోనుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి పర్సనల్ కెరీర్‌లో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిలుస్తోంది. ఈ రేంజ్ సక్సెస్‌కు ప్రధాన కారణం చిరంజీవి మార్క్ కామెడీ, టైమింగ్‌తో పాటు అనిల్ రావిపూడి టేకింగ్ అనే చెప్పాలి. చిరంజీవి వింటేజ్ లుక్, నయనతార నటన, విక్టరీ వెంకటేష్ చేసిన సందడి థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీగా రప్పిస్తున్నాయి. ‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ స్థాయి హిట్ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ఇదే విధంగా ఫోర్స్ ఉంటే మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Every theatre, every centre..
Every region and every heart…THE SWAG KA BAAP has conquered everything 😎
₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh
— Shine Screens (@Shine_Screens) January 19, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

