VK Naresh: వీకే నరేష్‌‌ని దర్శకులు పవిత్ర కోణంలోనే చూస్తున్నారా?
VK Naresh Varshini and Pavitra (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

VK Naresh: వీకే నరేష్‌లో ఉన్న నటుడిని పక్కన పెట్టి.. ఆ (పవిత్ర) కోణంలోనే చూస్తున్నారా?

VK Naresh: సీనియర్ నటుడు వి.కె. నరేష్ (Senior Actor VK Naresh) గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది. 60 ఏళ్ల వయసులోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీబిజీగా ఉంటూ, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నరేష్‌కి… ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా, కొందరు దర్శకులు ఆయనలో ఉన్న నటుడిని కాకుండా, ‘రొమాంటిక్ పురుషుడి’ కోణాన్ని మాత్రమే తెరపై చూపిస్తున్నారనే చర్చ ఊపందుకుంది. నరేష్ అంటేనే సహజత్వం ఉట్టిపడే నటనకు మారుపేరు. ఏ పాత్రనైనా రక్తి కట్టించగలిగే సత్తా ఆయన సొంతం. అందుకే, ఈ మధ్య వస్తున్న దాదాపు ప్రతి చిత్రంలో ఆయనకు ఏదో ఒక ముఖ్యమైన పాత్ర దక్కుతూనే ఉంది. ఈ వయసులోనూ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్‌ని చూస్తే, నటన పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం ఎంతటిదో అర్థమవుతుంది. మంచి నటుడిగా ఆయనకు ఉన్న గుర్తింపుపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు.

Also Read- MLA Raja Singh: రాజమౌళిని జైల్లో వేస్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!

‘పవిత్ర’ కోణంపై అనుమానాలు

ఆయన జీవితంలో ఇటీవల నటి పవిత్ర లోకేష్‌ (Pavitra Lokesh)తో జరిగిన నాలుగో వివాహం, ఆ తర్వాత వారి వ్యవహారం మీడియాలో వైరల్ అవ్వడం.. నరేష్‌ను ఒక ‘రొమాంటిక్ పర్సన్’గా ప్రేక్షకులు, ముఖ్యంగా నెటిజన్లు భావించడానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే, తాజాగా విడుదలైన ‘ఏనుగుతొండం ఘటికాచలం’ (Yenugu Thondam Ghatikachalam) చిత్రంలో నరేష్ పాత్ర తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సినిమాలో రిటైర్డ్ వ్యక్తిగా కనిపించిన 65 ఏళ్ల నరేష్, 31 ఏళ్ల వర్షిణి (Varshini)ని పెళ్లాడే సన్నివేశాలు ఉండటం.. అంతేకాకుండా, వారి మధ్య బెడ్‌రూమ్ సీన్లను కూడా చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సన్నివేశాల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read- NC24 Update: ‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో చూశారా? టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రొఫెషనల్ వర్సెస్ పర్సనల్ లైఫ్

ఈ పరిణామం నేపథ్యంలో, కొందరు దర్శకులు నరేష్‌లోని గొప్ప నటుడిని సరిగ్గా వాడుకోకుండా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా పవిత్ర లోకేష్‌తో ఆయన బంధాన్ని దృష్టిలో ఉంచుకుని, తెరపై ఆయన చేత అలాంటి రొమాంటిక్ అంశాలను మాత్రమే చేయిస్తున్నారేమో అనే టాక్ నడుస్తోంది. నరేష్ అనుభవాన్ని, నటనా పటిమను ఇలా ‘పవిత్ర’ కోణంలోనే వాడుకుంటున్నారా అనే సందేహం సినీ విమర్శకుల్లో, ప్రేక్షకుల్లో బలపడుతోంది. ఏదేమైనా, ఒక నటుడి వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, ఆయనలోని ప్రతిభను మాత్రమే తెరపై చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే, ఇది ఆయనలోని గొప్ప నటుడిని విస్మరించినట్లు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇలాంటి పాత్రలు చేయడానికి నరేష్ కూడా కాస్త ఆలోచించాలని కూడా వారు భావిస్తున్నారు. ఒక స్టార్ యాక్టర్‌గా సమాజం పట్ల కొంత బాధ్యతతో ఉండాలని, ఎలాంటి పాత్రలు పడితే అలాంటి చేయడం కరెక్ట్ కాదంటూ నరేష్‌కు కూడా కొందరు నెటిజన్లు హితబోధ చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!