MLA Raja Singh: ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ (Varanasi Globe Trotter Event) వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) చేసిన కామెంట్స్‌పై రాజుకున్న అగ్గి ఇంకా చల్లారలేదు. ఇంకా ఇంకా రాజుకుంటూనే ఉంది. ఇప్పటికే పలు చోట్ల రాజమౌళిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ నేతలు, హిందూ సంఘాలు రాజమౌళిపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా రాజమౌళిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళిని ఒకసారి జైల్లో పెడితే.. ఇకపై ఎవరూ హిందూ దేవుళ్లను కించపరచకుండా ఉంటారనేలా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియోలో..
నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది?
‘‘రాజమౌళికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన ఏం చెబుతున్నాడంటే.. నాకు దేవునిపై నమ్మకం లేదు. మా అమ్మనాన్నలకు ఉంది కానీ, నాకు మాత్రం నమ్మకం లేదని చెబుతున్నాడు. విశ్వాసం నీకు లేదు కానీ, అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ల పట్ల మూవీస్ తయారు చేసి, కోట్లకు కోట్లు సంపాదించుకోవాలి. అసలేంది.. నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే మూవీ తీస్తున్నావ్. ఆ మూవీకి ప్రచారం ఎక్కువగా కావాలనేది నీ ఉద్దేశ్యమా? లేక, నిజంగానే నువ్వు నాస్తికుడివా? ఒక్కసారి డిక్లేర్ చెయ్.
Also Read- NC24 Update: ‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో చూశారా? టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?
అసలు నీ తప్పు కాదు.. మా హిందువులలోనే ఒక తప్పు ఉంది. నీలాంటి ఫాల్తూ డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని మా హిందువులు ఐడింటిఫై చేయడం లేదు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ల పట్ల అభిమానం నీకు లేదు. నీ మూవీస్‌ని మా హిందువులు ఎందుకు చూడాలి? బాహుబలి సినిమా తీసినావ్. ప్రభాస్‌తో శివలింగం లేపించావ్.. దానితోని కోట్లకు కోట్ల రూపాయలు ఆ రెండు పార్ట్‌లతో సంపాదించుకున్నావ్. మళ్లీ మా హిందూ దేవుళ్లపైన నీకు నమ్మకం లేదు.
హిందూవులకు నా విజ్ఞప్తి
మా హిందువులకు ఈ సందర్భంగా ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాను. రాజమౌళికి ఇది ఫస్ట్ కాదు.. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణుడిపై లవర్స్ అంటూ ఆయన కామెంట్ చేశాడు. మళ్లీ నాకు రాముడిపైన విశ్వాసం లేదు, ఆయన స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా గతంలో ట్వీట్ చేశాడు. ఇప్పుడు హనుమంతుడిపైన కామెంట్ చేశాడు. నా హిందువులందరికీ ఈ సందర్భంగా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై కంప్లయింట్ ఇవ్వండి. ఇలాంటి వ్యక్తులను జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్లపై కామెంట్ చేస్తే.. నా గతి ఇది అని తెలిసి రావాలి. అలాగే ఇలాంటి వారు తీసే సినిమాలను ఎవరూ చూడకండి. మనం చూసి వందల, వేల కోట్లు అతను సంపాదించుకునేలా చేస్తాం. ఈ నాస్తికుడు మన ధర్మంపైన ఏది పడితే అది కామెంట్ చేస్తున్నాడు. అందుకని మన హిందువులకి అర్థం కావాల్సింది ఏమిటంటే.. మన ధర్మం పైన, మన దేశంపైన, మన సమాజంపైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే.. ఆయన గతి ఏమవుతది? అనేది తెలియజేయాల్సిన అవసరమైతే ఇప్పుడు ఉంది’’ అని రాజా సింగ్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read- Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై భరణి డాటర్ స్పందనిదే.. రీతూని కొట్టబోయిన ఆమె మదర్!
రాజమౌళికి విశ్వహిందూ పరిషత్ వార్నింగ్
హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, వెంటనే రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే.. ఇకపై ఆయన సినిమాలు ఆపిస్తామని విశ్వహిందూ పరిషత్ వార్నింగ్ ఇచ్చింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా? అని రాజమౌళిని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తున్నామని, డబ్బు గర్వంతో మాట్లాడితే విశ్వహిందూ పరిషత్ క్షమించదని ఆయన వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
