NC24 Update: ‘తండేల్’ సక్సెస్ తర్వాత యువసామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) చేస్తున్న నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ చిత్రం ‘NC24’. సాయి దుర్గ తేజ్‌తో ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ దండు (Karthik Dandu) ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ హిట్ వైబ్‌ని సినిమాపై తెచ్చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈసారి వీడియోతో మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్, అక్కినేని ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఇంతకీ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే..
Aslo Read- Kaantha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంత’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో
షూటింగ్ డిటైల్స్‌తో బిహైండ్ ది స్క్రీన్స్ వీడియో ఒకటి వదిలారు. ఈ వీడియోలో అత్యద్భుతమైన సెట్స్‌ని ఈ సినిమా కోసం రెడీ చేసినట్లుగా అర్థమవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయనేలా, నాగ చైతన్య చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే తెలుస్తోంది. డైరెక్టర్ పక్కా విజన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని, చాలా గ్రాండియర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని ఈ బీటీఎస్ మేకింగ్ వీడియో క్లారిటీ ఇచ్చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్ తంగాల కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వందలాది టెక్నీషియన్స్ కష్టపడి నిర్మించిన భారీ సెట్ విజువల్ ఎక్స్‌లెన్స్‌ను ప్రతిబింబిస్తోంది. ఇక ఈ వీడియోలో లాస్ట్‌లో ఇచ్చిన అప్డేట్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అవును.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ‘విరూపాక్ష’ వంటి టైటిల్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు కార్తీక్ దండు.. ఈ సినిమాకు ఏం టైటిల్ ఫిక్స్ చేశారా? అని ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఆ వార్తలన్నింటికీ నవంబర్ 23న తెరపడబోతుంది. ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్‌ను టీమ్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read- Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై భరణి డాటర్ స్పందనిదే.. రీతూని కొట్టబోయిన ఆమె మదర్!
నెవర్ బిఫోర్ లుక్‌లో చైతూ..
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఆమె పాత్ర పేరును రివీల్ చేస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మీనాక్షి దక్ష పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్‌లో గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్నట్లుగా చూపించి, ఆమె పాత్రపై మరింతగా ఆసక్తిని పెంచారు. ఫీల్డ్ డ్రెస్, గ్లవ్స్, గ్లాసెస్‌తో ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి ఈ పోస్టర్‌లో కనిపించారు. నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. అలాగే ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
