Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్ నడుస్తున్న విషయం తెలిసిందే. హౌస్‌మేట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపి, అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ (Bigg Boss). మరీ ముఖ్యంగా ఇన్ని వారాలుగా ఫ్యామిలీకి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్, తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూడగానే ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది హౌస్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లో సందడి చేయగా, 74వ రోజైన (Bigg Boss Telugu Season 9 Day 74) గురువారం కూడా ఫ్యామిలీ టైమే నడిచినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. గురువారం హౌస్‌లోకి భరణి ఫ్యామిలీతో పాటు, రీతూ ఫ్యామిలీకి చెందిన పర్సన్స్ వచ్చినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. అసలీ ప్రోమోలలో ఏముందంటే..
Also Read- Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?
బాండింగ్స్ కావాలని పెట్టుకున్నవి కావు..
భరణి ఫ్యామిలీ (Bharani Family)కి సంబంధించి వాళ్ల డాటర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గేటు నుంచి కాకుండా చాలా వెరైటీగా ఆమె ఎంట్రీని బిగ్ బాస్ ప్లాన్ చేశారు. ఎవరు వచ్చారో కూడా తెలియకుండా ముసుగులో ఆమెను ఉంచగా, రీతూ చూసి మొదట భయపడింది. దివ్య కేక వేయడంతో బయట వెయిట్ చేస్తున్న భరణి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. రావడమేంటో తన కుమార్తెను చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. హగ్ చేసుకుని, ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు. ఆ తర్వాత భరణికి తగిలిన దెబ్బని ఆమె అడిగి తెలుసుకుంది. సుమన్ శెట్టి ఇప్పుడు నాకు బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా చెప్పడంతో.. సుమన్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నాడు. ఇంటిలోని వారు ఎలా ఉన్నారని కుమార్తెను భరణి అడగగా.. అందరూ బాగున్నారని ఆమె చెప్పింది. నీ హెల్త్ జాగ్రత్త డాడీ.. ఆరోజు చూడలేకపోయాం అని మళ్లీ ఎమోషనలైంది. ‘‘నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. నీ కుమార్తెగా నిజంగా చాలా చాలా గర్వపడుతున్నాను. అందరూ బాండింగ్స్ బాండింగ్స్ అని అంటున్నారు కానీ, మీరు పెరిగిన వాతావరణం అలాంటిది. అందుకనే అందరినీ నా చెల్లి, నా కుమార్తె అంటూ.. మమ్మల్ని వాళ్లలో చూసుకుంటున్నారని నాకు తెలుసు. ఈ వీక్ నిన్ను కెప్టెన్‌గా చూడాలి’’ అని భరణికి తన కుమార్తె చెబుతున్నారు.
Also Read- Chiranjeevi: ‘కొదమసింహం’ రీ రిలీజ్.. రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్!
ఏం చెప్పాను? ఏం చేస్తున్నావ్?
రీతూ ఫ్యామిలీ (Rithu Family) అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. రీతూ వాళ్ల మదర్ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టే ముందు.. కన్ఫెషన్ రూమ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్రీజ్, తనూజ ఫ్రీజ్ అంటూ అందరికీ ఫాస్ట్ ఫార్వర్డ్ అని అంటున్నారు. దీంతో వచ్చింది తన మదర్ అని రీతూ కనిపెట్టేసింది. ఇమ్ము ఫ్రీజ్ అని చెప్పి వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పడంతో, అతన్ని పవన్, కళ్యాణ్ బంధించేశారు. ఎవ్రీ వన్ ఫ్రీజ్ అని రీతూ మదర్ చెప్పారు కానీ, ఆమె ఎక్కడున్నారో ఎవరూ కనిపెట్టలేకపోయారు. దీంతో రీతూ ఎమోషనల్ అవుతోంది. అప్పుడు రూమ్ నుంచి ఆమె బయటకు వచ్చారు. ఏడ్చుకుంటూ వెళ్లి తన మదర్‌ని హగ్ చేసుకుంది రీతూ. ఐ మిస్ యూ అని రీతూ అంటుంటే.. ‘నిన్ను కొట్టాలి చాలా.. నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? చపాతీ కర్ర ఉంటే ఇవ్వండి’ అని రీతూ మదర్ హౌస్‌మేట్స్‌ని అడుగుతున్నారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ నడుస్తుంది. మొత్తంగా చూస్తే.. ఈ రోజు కూడా ప్రేక్షకులతో కంటితడి పెట్టించేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
