Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించామంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ ‘తాండవం’ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలు సృష్టించాయి. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఫస్ట్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య హిందీలో మాట్లాడుతూ.. అక్కడి మీడియాను బాగా ఆకర్షించారు. తన హిందీ పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తాజాగా జరిగిన వైజాగ్ ఈవెంట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Nayanthara: అవకాశాలతోనే అందరికీ సమాధానమిస్తోన్న లేడీ సూపర్ స్టార్..
బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా..
వైజాగ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘అఖండ- 2’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ (Jajikaya) అంటూ సాగే పవర్‌ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా.. స్టార్ సింగర్స్ శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా పాటని కంపోజ్ చేశారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో పాట గురించి చెప్పడం అంతా ఓకే కానీ, హిందీలో ఇరగదీశా, అక్కడ జెండా పాతేస్తా అన్నట్లుగా బాలయ్య ఇచ్చిన స్పీచ్‌పై రకరకాలుగా కామెంట్స్ పడుతున్నాయి. ముఖ్యంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పిన బాలయ్య, ఇంకా గెలవకుండానే హిందీ వాళ్లకి మన దెబ్బేంటో చూపించానని అనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉన్నా.. విడుదల వరకు ఆగితే బాగుండేదని కొందరు హితబోధ చేస్తుండటం విశేషం. అందులోనూ బాలీవుడ్ ప్రేక్షకులను అస్సలు నమ్మడానికి లేదు. ఎలాంటి సినిమానైనా వాళ్లు పక్కన పెట్టేస్తారు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా.. ఈ మధ్య బీభత్సమైన ఫ్లాప్స్‌ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి బాలయ్య కాస్త చూసుకుని మాట్లాడితే బాగుండేదనేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి.
Also Read- Shah Rukh Khan: ‘కింగ్ ఖాన్’ చదువులోనూ బ్రిలియంటే.. సోషల్ మీడియాలో షారుఖ్ మార్క్ షీట్ వైరల్!
హిందీవాళ్లకు దిమ్మతిరిగిపోయింది
అసలీ వేడుకలో బాలయ్య ఏం మాట్లాడారంటే.. ‘‘మొన్న మన దెబ్బేంటో ముంబైలో హిందీవాళ్లకు చూపించాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. కోవిడ్ టైమ్‌లోనే ‘అఖండ’ సినిమా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే అప్పట్లో మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ‘అఖండ’తో అందరి అంచనాలు పెరిగాయి. అందుకే ఈ ‘అఖండ తాండవం’ సినిమా అంచనాలను మించేలా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు పనిచేసిన అందరూ అదృష్టవంతులు. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం శక్తి, పరాక్రమాన్ని చాటిచెప్పే చిత్రం. మన జాతి మూలాలు ఏంటో తెలియజేసే చిత్రం. అందుకే అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. కర్ణాటక, తమిళనాడు కూడా వెళ్లి ప్రమోట్ చేస్తాం. మొన్న ముంబైలో మన దెబ్బకు హిందీవాళ్లకు దిమ్మతిరిగిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
