Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Lady Super Star Nayanthara) పని అయిపోయిందని, ఇక ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఆమె తన సినిమాల సంఖ్యతోనే ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి కాదు, అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు ఉండటం చూస్తే, నయనతార స్టార్‌డమ్, డిమాండ్ ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె అభిమానులు ఈ పరిణామంపై అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధనుష్‌తో జరిగిన కాంట్రవర్సీ తర్వాత, నయనతార ఇక సినిమాలకు దూరంగా ఉంటుందనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అయితే, ఆ వార్తలన్నిటికీ ముగింపు పలుకుతూ, నయనతార తన కమిట్‌మెంట్లతో ముందుకు దూసుకెళ్తున్నారు.
Also Read- Shah Rukh Khan: ‘కింగ్ ఖాన్’ చదువులోనూ బ్రిలియంటే.. సోషల్ మీడియాలో షారుఖ్ మార్క్ షీట్ వైరల్!
ఒకేసారి చిరు, బాలయ్య సరసన ఛాన్స్
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటున్న నయనతార ఇక తెలుగులో హీరోయిన్‌గా నటించడం కష్టమే అని అనుకుంటున్న సమయంలో, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ఆమె ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమాను ఒప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా, సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమాకు దగ్గరుండి ప్రమోట్ చేస్తుండటం విశేషం. వీటన్నిటినీ మించి, ఆమె కెరీర్‌లోనే ఊహించని పరిణామంగా నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన NBK111వ సినిమాలో కథానాయికగా నటించడానికి సిద్ధమైంది. ఆమె ఇందులో ‘క్వీన్’గా కనిపించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రావడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా ఆమె అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరోసారి చిరంజీవితో నటిస్తున్న నయనతార.. ‘సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం’ తర్వాత నాల్గవసారి బాలయ్యతో జతకడుతున్నారు. నయనతార బర్త్ డే స్పెషల్‌గా మంగళవారం ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అనౌన్స్‌మెంట్‌లో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తే.. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకమైనదనే విషయం అర్థమవుతోంది.
Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
సౌత్‌లో తిరుగులేని ఆధిపత్యం
నయనతార కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ముఖ్యమైన సినిమాల విషయానికి వస్తే.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమాలో ఆమె ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. కోలీవుడ్‌కు సంబంధించి ‘మంగాట్టి’, ‘హాయ్’, ‘ముక్కుత్తి అమ్మన్ 2’ వంటి ప్రాజెక్టులు నయనతార చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్, వరుసగా పెద్ద ప్రాజెక్టులను ఒప్పుకోవడం చూస్తుంటే, తనపై విమర్శలు చేసే వారికి మాటలతో కాకుండా కేవలం అవకాశాలతోనే నయనతార ఘాటు సమాధానం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆమె ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
