Manchu Lakshmi: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), ఆయన భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) పై మంచు లక్ష్మి (Manchu Lakshmi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఆడపిల్లగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న సంఘటనలు ప్రస్తావిస్తూ.. మరీ ముఖ్యంగా దిగ్గజ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఆమె ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో తాజాగా చెప్పుకొచ్చారు. ఒక దిగ్గజ నటుడి వారసత్వాన్ని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదన్నారు. అందులోనూ ఆడపిల్లగా అంచనాలను అందుకోవడం చాలా కష్టమని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆ లెగసీని కంటిన్యూ చేయడం చాలా భారంగా ఉండేదని, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందని తన తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు, ఈ భారం తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నానని ఆమె తెలిపారు.
నా కారణంగా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదని..
నటిగా, నిర్మాతగా, ఇంకా ఎన్నో రంగాల్లో ప్రతిభను కనబరిచి ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ.. తనకు వారసత్వపు భారం నుంచి విముక్తి లభించలేదని, సంప్రదాయానికి పెద్ద పీట వేసే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది తప్పని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నించి అలసిపోయానని, చివరకు ఆ ప్రయత్నం వ్యర్థమని తెలుసుకున్నానని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత, తన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యమని భావించానని, సమాజంపై, వ్యవస్థలపై గొడవ పడే కంటే, వాటిని అనుసరిస్తూ ముందుకు సాగడమే మంచిదని గ్రహించానని అన్నారు. ఈ ప్రయాణంలో నటులు ఎక్కువగా ఉన్న కుటుంబం నుంచి రావడం కూడా తనపై ప్రభావం చూపించిదని.. ఎక్కడ, ఏం మాట్లాడితే అది తన కుటుంబంలో ఉన్న నటులకు ఇబ్బంది కలిగిస్తుందో అని ప్రతి సందర్భంలో ఆలోచించాల్సి వచ్చేదని ఆమె వెల్లడించారు. తనంతట తానుగా ఏమీ సాధించలేననే మాటలను ఎక్కువగా వింటూ పెరిగానని, అందుకే.. వెనుక ఎవరూ లేరనుకుని ప్రయాణం మొదలు పెడితేనే పైకి ఎదగగలనని నిర్ణయించుకుని, తన జర్నీని మొదలు పెట్టినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.
మహేష్, నమ్రతలను కొట్టేస్తా..
దక్షిణాదిలోని చాలా మంది నటులు తమ కుమార్తెలను లేదా సోదరీమణులను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి, ప్రోత్సహించడానికి సంకోచిస్తారనే నమ్మకం గురించి ఆలోచిస్తూ, ఆ మానసిక స్థితి బలంగా పాతుకుపోయిందని లక్ష్మి అంగీకరించారు. అందుకే ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ కుమార్తెలు తక్కువ మంది తెరపై కనిపించారని, వారికి సపోర్ట్ చేసే వారు లేరనే అంశాన్ని ఆమె హైలైట్ చేశారు. ఈ క్రమంలో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల కుమార్తె సితార పెరుగుతున్న విధానాన్ని ఆమె ప్రశంసించారు. సితారకు శక్తిని ఇవ్వడానికి, ఎంతో మంది యువతులకు వారి ఆశయాలను స్వేచ్ఛగా అన్వేషించడానికి, వారికి ప్రేరణగా నిలవడానికి నమ్రతా శిరోద్కర్ ఇస్తున్న సపోర్ట్‌ను ఆమె కొనియాడారు. ‘నమ్రత, మహేష్ కనుక తమ కుమార్తెను బయటికి తీసుకురాకపోతే, నేను వారిద్దరినీ కొట్టడానికి కూడా వెనుకాడనని’ ఆమె సరదాగా అన్నారు.
Also Read- Hyper Aadi: సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి హైపర్ ఆది స్వీట్ వార్నింగ్.. ముందు ఇది పోవాలి..
టీనేజ్‌లో లైంగిక వేధింపులకు గురయ్యా..
ఇంకా మంచు లక్ష్మి తన టీనేజ్ నాటి బాధాకరమైన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. తనకు కేవలం పదిహేనేళ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. తనని కొందరు అనుచితంగా తాకిన తర్వాత, ఆ స్పర్శను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియక, గందరగోళానికి గురయ్యానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇదే విషయం తన స్నేహితులకు చెప్పినప్పుడు, వారిలో కూడా చాలా మంది అదే విధమైన అనుభవాలను ఎదుర్కొన్నామని చెప్పడం విని ఎంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత ఇటువంటి భయంకరమైన వేధింపులు సాధారణమని.. వయస్సు, నేపథ్యంతో సంబంధం లేకుండా జరుగుతాయని, ఇది కేవలం తనొక్కరికే జరిగింది కాదని ఆమె గ్రహించినట్లుగా చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
