Kaantha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంత’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
Kaantha OTT (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Kaantha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంత’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!

Kaantha OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన బైలింగ్వల్ మూవీ ‘కాంత’ (Kaantha) ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్ వచ్చేశాయ్. సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ థ్రిల్లర్‌లో రానా (Rana Daggubati), సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా విడుదలకు ముందు టీజర్, సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, విడుదల తర్వాత మాత్రం అనుకున్నంతగా ఈ బజ్‌ని చేరుకోలేకపోయింది. నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డిటైల్స్ వచ్చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై భరణి డాటర్ స్పందనిదే.. రీతూని కొట్టబోయిన ఆమె మదర్!

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

సినిమా థియేటర్లలో వర్కవుట్ కాకపోవడంతో.. వెంటనే ఓటీటీకి తెచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అన్ని భాషలకు కలిపి నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 40 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను డిసెంబర్ 12న తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతోంది. 1960 నాటి సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా, ఇందులోని పాత్రలు పోషించిన నటుల నటనకు మంచి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదం కూడా నడిచిన విషయం తెలిసిందే.

Also Read- Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?

ఈగో ఇష్యూస్‌తో నడిచే కథ..

ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఒక సినిమా షూట్‌లో డైరెక్టర్, హీరోకు మధ్య ఈగో ఇష్యూస్ రావడం, తద్వారా యూనిట్‌లోని ఒకరు మృతి చెందడం జరుగుతుంది. ఆ మృతి వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? యూనిట్ సభ్యుడిని హీరో, డైరెక్టర్‌లలో ఎవరు చంపారు? ఈ కేసును పోలీస్ ఆఫీసర్ ఎలా చేధించాడనేది మెయిన్ కథాంశం. కథ పరంగా ఆసక్తికరంగా ఉన్నా, దర్శకుడు ఈ కథని తెరకెక్కించడంలో తడబడ్డారని, ప్రిడక్టబుల్‌గా స్టోరీ ఉండటంతో, జనాలు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు. థియేటర్లలో సక్సెస్ కొట్టలేకపోయినప్పటికీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమా అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చూద్దాం మరి.. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణను రాబడుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!