Vishwak-Sen
ఎంటర్‌టైన్మెంట్

Vishwak Sen: కాంట్రవర్సీ కా దాస్.. డైరెక్టర్ జాబ్‌లో వేలు పెడుతున్న విశ్వక్?

Vishwak Sen: ‘లైలా’ (Laila) సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన విశ్వక్ సేన్(Vishwak Sen) ఫిల్మోగ్రఫీపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫ‌ల‌క్‌నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో ప్రామిసింగ్ యాక్టర్ గా ఎదిగిన ఆయనకు పెద్ద పెద్ద నటుల ఆశీర్వాదం కూడా లభించింది. అయితే ఈ సినిమాలు మినహా ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ ఆడియెన్స్ కు తలపోటు తెప్పించాయి. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకున్న విశ్వక్ కెరీర్ గురించి విశ్లేషకులు మాట్లాడుతున్న తీరు ఇప్పడు మాస్ కా దాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. ఈ క్రమంలో ఆయన మంచి కథలను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎంచుకుంటే బెటర్ అని చెబుతున్నారు. అయితే లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న ఓ వార్త మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే..

Also Read: ‘వెంకీ అట్లూరి’ ఎటుపోతున్నావ్ సామి..

ఇప్పటికే ఫ‌ల‌క్‌నుమా దాస్ తో విశ్వక్ డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న.. నెక్స్ట్ డైరెక్టోరియల్ దాస్ కా ధమ్కీ మాత్రం బెడిసికొట్టింది. అయితే ఆయన నెక్ట్స్ జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఫంకీ(Funky Film) అనే సినిమా పట్టాలెక్కించినా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు అనుదీప్ (Anudeep) డైరెక్ట్ చేస్తున్నా.. విశ్వక్ ను డైరెక్టర్ అనే పిలుస్తున్నారట. ఎందుకంటే ఈ సినిమాలో విశ్వక్ డైరెక్టర్ రోల్ లో నటించనున్నాడని సమాచారం. విశ్వక్ డైరెక్టర్ జాబ్‌లో వేలు పెట్టడం లేదు కానీ.. డైరెక్టర్ గా కనిపిస్తున్నాడు అంతే. ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. చూడటానికి సాదాగా కనిపించే అనుదీప్ స్ట్రాంగ్ సెటైర్, హ్యూమర్ రాయగల సత్తా ఉన్నా అరుదైన దర్శకుడు. అయినా కానీ ఎందుకో ఈ సినిమాపై అంచనాలు మాత్రం పెరగడం లేదు. అనుదీప్ ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాజిక్ చేస్తేనే విశ్వక్ మెరిసే ఛాన్స్ ఉంటుందని అంతా అంటున్నారు.

Funky

మరో వివాదం?

అయితే అనుదీప్ ప్రాజెక్ట్ తర్వాత విశ్వక్.. భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ.. ఆ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు ఆయన మిగిలిన సినిమాలు ఆపి ఫలక్‌నుమా దాస్ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇప్పటికే అర్జున్ సినిమా నుండి వైదొలిగి వివాదాస్పదం అయినా విశ్వక్ మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఆపేస్తే.. మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో విశ్వక్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?