Vishnupriya : టెలివిజన్ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన విష్ణుప్రియ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా మరింత పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అయితే, తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అనుభవాలపై ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘డబ్బుల కోసమే వెళ్లా… అది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం’ అని గతంలో బిగ్ బాస్ గురించి చెప్పిన విష్ణుప్రియ, చివరికి డబ్బు ఆఫర్‌ను అంగీకరించి సీజన్ 8లో పాల్గొన్న విషయాన్ని ఒప్పుకుంది. “ఆ నిర్ణయం తప్పు అని ఇప్పుడు భావిస్తున్నాను. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రతి రోజూ నన్ను నేను తిట్టుకున్నా. ‘ ఎందుకు ఇక్కడికి వచ్చానా అని ?’ అని తల పట్టుకుని కూర్చున్నా” అని ఆమె బాధపడింది. ‘లగ్జరీ లైఫ్‌కు అలవాటు… బిగ్ బాస్ టార్చర్’ బిగ్ బాస్ హౌస్‌లోని కఠిన జీవన పరిస్థితులను వివరిస్తూ, “అక్కడ మసాజ్ లేదు, కాఫీ లేదు, సరైన నిద్ర లేదు. బయట మూడు రోజులు పని చేసి నాలుగో రోజు మసాజ్‌కు వెళ్లి రిలాక్స్ అయ్యే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డ నాకు బిగ్ బాస్ అనుభవం చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది” అని తెలిపింది.
కొత్త ఇల్లు వస్తుంది, మంచి డబ్బులు వస్తాయని వెళ్లాను. కానీ అదేం జరగలేదు. ఇప్పటికీ అదే ఇంట్లోనే ఉన్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన కొంత డబ్బును మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను ” అని ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ‘ఫ్యాన్స్ లవ్ మాత్రం దొరికింది ’ అయినప్పటికీ, షో తర్వాత తనను ఇష్టపడే అభిమానుల సంఖ్య పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేసింది. “నన్ను లవ్ చేస్తూ, సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి ఫైన్ అనిపించింది. కానీ, మళ్లీ బిగ్ బాస్‌కు వెళ్లమంటే ఖచ్చితంగా వెళ్లను” అని స్పష్టం చేసింది.
