Virgin Boys Teaser
ఎంటర్‌టైన్మెంట్

Virgin Boys Teaser: కపుల్ కిస్ సీన్.. ఈ టీజర్‌కే హైలెట్!

Virgin Boys Teaser: ‘వర్జిన్’ అనే పేరు కనబడగానే మైండ్ ఏదేదో ఆలోచిస్తుంటుంది. అందులో సినిమా పేరే ‘వర్జిన్ బాయ్స్’ అంటే.. కచ్చితంగా ఇది అడల్ట్ సినిమా అని ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్క టైటిల్‌తోనే సినిమాపై క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా టీజర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు. ఇప్పుడీ టీజర్ యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరో హీరోయిన్లుగా.. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌ వంటి వారంతా ఇతర పాత్రలలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys Movie). రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మించారు. ఈ చిత్ర టీజర్ విడుదలై, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఈ టీజర్‌ని గమనిస్తే..

Also Read- OG Movie: ఇంకేంటి మరి.. ఈసారి ముగించేద్దాం!

మిత్రో.. శపథ్ కరో అంటూ ముగ్గురు ఫ్రెండ్స్ ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఈ టీజర్ ప్రారంభమైంది. ‘‘గోల్డెన్ ఏజ్‌లో ఉన్న మేము.. మైండ్‌లో ఉన్న డౌట్ క్లియర్ చేస్తానని, ఆ సూర్యుని మొదటి కిరణాలు భూమిని టచ్ చేసే లోగా, మేము కూడా ఎవరినో ఒకరిని టచ్ చేస్తామని, పక్కా మా వర్జినిటీని పోగొట్టుకుంటామని.. ఇదే మా ఆన, ఆన ఆన’’ అనే డైలాగ్‌తో ఇది ఏ తరహా చిత్రమో క్లారిటీ ఇచ్చేశారు. అక్కడి నుంచి కళ్లు పక్కకు తిప్పుకోనివ్వని విధంగా టీజర్‌ని నడిపించారు. మరీ ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఓ కపుల్ ముద్దు పెట్టుకునే సీన్ ఈ టీజర్‌కే హైలెట్ అనేలా ఉంది. ఇక దబిడి దిబిడే.. అనే డైలాగ్‌తో పాటు టీజర్ చివరిలో ‘వీడికి ఆత్రం ఎక్కువ, మూత్రం తక్కువ’ అనే డైలాగ్‌తో ముగించారు. ఒక నిమిషం, 23 సెకన్లు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా కట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కానీ, కాస్త వైవిధ్యతతో ఈ సినిమా ఉంటుందనే హింట్‌ని అయితే ఈ టీజర్ ఇచ్చేస్తుంది.

Also Read- Monalisa: గుడ్ న్యూస్.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న కుంభమేళ మోనాలిసా

ఈ టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు మాంచి జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ మూడ్‌కి తగినట్లుగా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో పాటు.. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందనేది ఈ టీజర్ చెప్పేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్, కామెడీ టైమింగ్‌ దబిడి దిబిడే. టీజర్‌లోని డైలాగ్స్, సీన్స్ ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమాను రూపొందించాం. రొటీన్‌కి భిన్నంగా ఉంటూ, యూత్‌ని బాగా ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..