OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. అభిమానులు కొన్నాళ్లుగా దేని కోసమైతే వేచి చూస్తున్నారో ఆ శుభవార్త వచ్చేసింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు మూడు. అందులో ‘హరి హర వీరమల్లు’ సినిమా రీసెంట్‌గానే షూటింగ్ ముగించుకుంది. కేవలం 2 రోజుల పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ షూట్ నిమిత్తం ఈ సినిమా ఎన్ని సార్లు వాయిదా పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు మూడు నెలలుగా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ డేట్ అంటూ నిర్మాతలు ప్రకటించడం, ఆ రెండు రోజుల షూట్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేయడం జరుగుతూ వస్తుంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఆ షూట్‌ని పూర్తి చేశారు. ఇప్పుడా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అంతేకాదు, జూన్ 13న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చేసింది.
Also Read- Monalisa: గుడ్ న్యూస్.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న కుంభమేళ మోనాలిసా
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కొంత మేర షూటింగ్ పూర్తి చేసిన సినిమా, ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్న సినిమా అంటే అది ఖచ్చితంగా ‘ఓజీ’ సినిమానే అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఏ సభ పెట్టినా, ఫ్యాన్స్ అంతా ‘ఓజీ ఓజీ’ అంటూ అరుస్తూ.. ఆ సినిమా మాకు కావాలనేలా సందేశం ఇస్తున్నారు. ఈ మధ్య ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ కూడా అయ్యారు. పొలిటికల్ మీటింగ్స్‌లో పదే పదే అలా అరవవద్దని వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లారు. అయినా కూడా ఫ్యాన్స్‌లో నో ఛేంజ్. అది ‘ఓజీ’ (OG)కి ఉన్న క్రేజ్. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘హరి హర వీరమల్లు’ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ‘ఓజీ’ సెట్స్‌లోకి దిగేశారు. ఈ విషయం స్వయంగా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, వారెంత ఆనందంగా ఉన్నారో, ఎలాంటి మూడ్‌లో ఉన్నారో తెలిపేందుకు బ్రహ్మీ ఇమేజ్‌తో ఓ పోస్ట్ చేశారు.
Also Read- Sivaji Raja: నాకు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది.. చిరంజీవి చెప్పాడనే అలా చేశా..
‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’ అంటూ ఆన్‌లొకేషన్ ఫొటోని షేర్ చేసిన టీమ్.. ఓజీ తన ఇలాఖాలోకి అడుగు పెట్టినట్లుగా తాజాగా అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో అన్నీ సక్రమంగా జరిగితే.. దసరాకి ‘ఓజీ’ బరిలో ఉండే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఈ సినిమా షూట్ ఎంత మేరకు పూర్తయింది. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ ఓకే చేసిన మూడో సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమా కూడా కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
Alaantodu Malli Thirigi Vasthunnaadante…#OG #TheyCallHimOG #PKBackOnOGSets pic.twitter.com/1Ocaub9u5y
— DVV Entertainment (@DVVMovies) May 14, 2025
జూన్ 12 నుంచి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్స్‌లో పాల్గొంటారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం.. ఈ మధ్య పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, వాటికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, ఈ మూడు సినిమాలు పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లుగా అయితే తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. పాలిటిక్స్‌కు ఎటువంటి అంతరాయం జరగకుండా.. ఆయన మెయిన్ ఆఫీస్ చుట్టూ ఉన్న పరిసరాలలోనే ఆయన చేస్తున్న సినిమా షూటింగ్‌ని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు