Sivaji Raja: నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. దాదాపు స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 90 స్ రోజుల్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఇతను ఉండేవాడు. అప్పట్లో అంత క్రేజ్ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను లేకుండా ఏ సినిమా వచ్చేది కాదు.
Also Read: Ram Charan – Jr NTR: ఎన్టీఆర్ ను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రామ్ చరణ్.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్
కొత్త నటులు రావడంతో పాత వాళ్ళకు అవకాశాలు తగ్గాయి. ఇంతక ముందు వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న శివాజీరాజా ప్రస్తుతం స్పీడ్ తగ్గింది. అయితే, శివాజీరాజా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Hero Sumanth: మృణాల్ తో పెళ్లి .. సుమంత్ అలా అనేశాడేంటి.. మాకు నమ్మకం లేదు దొర అంటున్న నెటిజన్స్?
శివాజీరాజా మాట్లాడుతూ.. ” నేను అప్పట్లో సిగరెట్ పిచ్చి పిచ్చిగా తాగేవాడ్ని. అసలు ఎలా అంటే రోజూ రెండు మూడు పెట్టెలు కంటే ఎక్కువే తాగేవాడ్ని. మా అమ్మ , నా భార్య , శ్రీకాంత్.. ఇలా నాకు బాగా దగ్గరైన వాళ్ళ మీద ప్రామిస్ చేశా .. కానీ, నేను మారలేదు, మానెయ్యలేదు. 2000 లో బెంగుళూరులో ఉన్న మెగాస్టార్ ఇంట్లో చిరు మీద ఒట్టు చేశా. ఆయన చేతిలో నా చేయి పెట్టి బలంగా మాట ఇచ్చా.. మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు. ఇప్పటికి 25 ఏళ్ళు అయిందని ” షాకింగ్ కామెంట్స్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.