Ram Charan – Jr NTR: ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. టాలీవుడ్ లోనే ఈ మూవీ ఆల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే, తాజాగా ఒకే వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మెరిశారు.
Also Read : Mega Health Camp: పేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం.. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి!
తాజాగా, లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా రామ్ చరణ్, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి స్నేహాన్ని చూసి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతే కాదు, ఎన్టీఆర్ ను హాగ్ చేసుకుని రామ్ చరణ్ ముద్దు పెట్టడం ఈవెంట్ కే హైలైట్‌గా నిలిచింది. అంతక ముందు ఇదే వేదికపై ‘బాహుబలి’ లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు