Chiranjeevi: వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్
Megastar Chiranjeevi addressing the audience at the MSG success meet, holding a microphone and sharing his thoughts on the film’s achievement.
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్.. ఈ సంక్రాంతి అదిరిపోయింది

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)‌ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్ర ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్‌ని ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కి షీల్డ్స్ అందించారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

విజయం ఇచ్చే ఉత్సాహం కూడా అంతే..

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరి ఆనందంలో సక్సెస్‌ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విజయాన్ని చూసి సుస్మిత చాలా ఎక్సైటింగ్‌గా నాతో మాట్లాడింది. ఇలాంటి విజయాలు మీకు కామన్ అని చెప్పింది. సక్సెస్ ఎప్పుడూ కూడా బోర్ కొట్టదు. మనం ప్రతిరోజు తినే అన్నం, కూర మనకు ఎలా అయితే బోర్ కొట్టవో.. విజయం ఇచ్చే ఉత్సాహం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియారిటీతో మెచ్యూరిటీ రావడంతో ఒక్కొసారి ఒక్కోలా స్పందిస్తాం తప్పితే మీరందరూ ఈ విజయాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. అంతకంత మనసులో నేను ఆస్వాదిస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి వాళ్లతో ఇంట్రాక్ట్ అవ్వండి ప్రేక్షకులు ఇచ్చే కిక్కు వేరే ఉంటుందని అనిల్, సాహు‌తో చెప్పాను. వాళ్ళు ఇచ్చే ఉత్సాహం భవిష్యత్తులో చేసే సినిమాలకి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. ఇలాంటి ప్రేమని నేను ఎన్నోసార్లు అనుభవించాను. అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత పునరావృతం అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

Also Read- Anil Ravipudi: రాజమౌళితో పోల్చవద్దు.. నేను అన్నేళ్లు టైమ్ తీసుకోలేను

అంత ఎంజాయ్ చేశా..

ఎగ్జిక్యూటివ్స్‌కి, బయ్యర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మా చేతుల మీద షీల్డ్స్ ఇవ్వడం చూస్తుంటే వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కూడా తీసుకొచ్చిన క్రియేటివ్ అనిల్‌దే. నిజంగా ఇది నాకు ఒక నాస్టాలజీ ఫీలింగ్. అనిల్ వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు రాఘవేంద్రరావు గుర్తొస్తారు. ఆయనే నాకు అనిల్‌ని పరిచయం చేశారు మేము కలిసి పని చేస్తే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. వివి వినాయక్ లాగా అనిల్ కూడా మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. ‘ఖైదీ నెంబర్ 150, వాల్తేర్ వీరయ్య’ తర్వాత ఈ మధ్యకాలంలో అంత ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షూటింగ్ చివరి రోజు చాలా ఎమోషనల్ అయ్యాను. యూనిట్ అందరిని దగ్గరగా తీసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఇలాంటి వండర్‌పుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి‌కి, తన రైటింగ్ టీమ్‌కి, తన డైరెక్టర్ టీమ్‌.. అందరికీ థాంక్యూ.

Also Read- Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్.. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ

ఈ సంక్రాంతి అదిరిపోయింది

ఈ సినిమాకు అందరం ఒక కుటుంబంలో కలిసి పని చేశాం. సాహు, మా అమ్మాయి సుస్మిత అందరం కూడా ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్‌తో కలిసి పని చేసాం. సినిమా షూటింగ్ సమయంలో టీం మధ్య ఒక ఫ్యామిలీ లాంటి బాండింగ్ ఉంటే దాన్ని రిజల్ట్ కచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలే. ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినందుకు, ఇందులో వారధిలా పనిచేసిన బయ్యర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. అన్ని సినిమాలకు సక్సెస్ అందించారు. ఒకటీ ఆరా మినహా అందరికీ కూడా మంచి సక్సెస్ దొరికింది. ఇది జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. నిజంగా ఈ సంక్రాంతి అదిరిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?