Anil Ravipudi: ఈ సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)తో వరుసగా మరో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 350 కోట్ల గ్రాస్‌ని బీట్ చేసి, మూడో వారంలోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటరైందీ చిత్రం. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా అనిల్ రావిపూడి తన మనస్సులోని అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నాగార్జునతో సినిమా చేస్తా..
‘‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్ అయిన ఇందువదన కుందరదన పాటను, ఈ సినిమాలో మళ్లీ వాడటంపై ఆయన చాలా సరదాగా తీసుకున్నారు. వెంకటేష్ మేనరిజం చిరంజీవితో చేయించడానికి, ఆయన ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అదే సమయంలో వెంకటేష్ పాటలకు మెగాస్టార్ డాన్స్ చేశారు. మెగాస్టార్‌లో ఉండే గ్రేస్ మళ్లీ ఈ సినిమాలో కనిపించింది. టాలీవుడ్ అగ్ర హీరోలైన నలుగురిలో ముగ్గురితో సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ మిగిలిన ఒక్కరైన కింగ్ నాగార్జునతో కూడా త్వరలోనే సినిమా చేస్తాను.
Also Read- Mohan Babu: మోహన్ బాబుకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు
పెద్ద డైరెక్టర్ అని అనుకోను
నా సినిమాలన్నీ వరుస సక్సెస్‌లు అవుతున్నందుకు అందరూ నన్ను రాజమౌళితో పోల్చుతున్నారు. దయచేసి నన్ను ఆయనతో పోల్చవద్దు. రాజమౌళి ఒక సినిమాని నాలుగేళ్లు తీసినప్పటికీ.. ఆ క్వాలిటీ ఔట్‌పుట్ నేను ఇవ్వలేను. అదే సమయంలో, నేను తీసే సినిమాకి అన్నేళ్లు టైమ్ కూడా తీసుకోలేను. మంచి కథతో డైరెక్టర్లు వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. నేనేమీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్‌ను అని అనుకోను. ఇండస్ట్రీలో నాకంటే మంచి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. నన్ను జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వినాయక్, శ్రీను వైట్లతో పోల్చుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ల సినిమాలతో నేను ఇన్‌స్పైర్ అయ్యాను.
Also Read- Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్.. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ
క్లీన్ కామెడీ
దర్శకుడిగా నా మొదటి సినిమా పటాస్. ఆ సినిమా హిట్ అయితే చాలని అనుకున్నాను. ఇన్ని సినిమాలు చేస్తానని, వరసగా హిట్ కొడతానని ఎప్పుడూ అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రిలీజ్ తర్వాత మళ్లీ జనం థియేటర్‌కు రావడం ప్రారంభమైంది. నా సినిమాలు ఎప్పుడూ కుటుంబంతో కలిసి చూసేలా.. క్లీన్ కామెడీ ఉండేలా చూసుకుంటాను. ఫ్యామిలీలో ఎవ్వరూ నా సినిమా చూస్తూ ఇబ్బంది పడకూడదు. నా సినిమాల్లోని కామెడీ ట్రాక్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని, ఎంతో జాగ్రత్తగా రాసుకుంటాను. అదే, నన్ను ఇంత వరకు తీసుకొచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

