Sir Madam Press Meet
ఎంటర్‌టైన్మెంట్

Sir Madam: అప్పుడు సైలెన్స్, ఇప్పుడు వైలెన్స్.. సందడి సందడిగా ‘సార్ మేడమ్’!

Sir Madam: వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మేనన్‌ (Nithya Menen) హీరోయిన్‌గా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. ‘ఏ రగ్డ్ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటివలే తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ని అందుకుంది. ఆగస్ట్ 1న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తెలిపేందుకు టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది.

Also Read- Hari Hara Veera Mallu: ఫేక్ రివ్యూస్.. నీ యాపారమే బావుందిగా నా అన్వేష్!

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ఈ ‘సార్ మేడమ్’ సినిమా తమిళ్‌లో చాలా పెద్ద హిట్ అయింది. ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. నేనెప్పుడు హైదరాబాద్ వచ్చినా.. తెలుగు ప్రజలు నాపై ఎంతో ప్రేమ, అభిమానాన్ని చూపిస్తారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాకి తెలుగు పాటలు రాంబాబు చాలా చక్కగా రాశారు. ఆ పాటలు వినసొంపుగా వున్నాయి. అందరూ ఓన్ చేసుకునే కథ ఇది. అంతేకాదు, ఈ సినిమా కోసం నేను పరాటా చేయడం కూడా నేర్చుకున్నాను. అందుకోసం రెండు నెలల కోర్స్ కూడా చేశాను. డైరెక్టర్ పాండిరాజ్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నేను ఏ పాత్ర చేసినా.. ప్రతి సినిమాను ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఈ సినిమా కూడా నాకు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చింది. డైరెక్టర్ ఈ కథని చాలా అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా చిత్రీకరించారు. అందరం ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. నిత్యా మీనన్‌తో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీనే. మేము ఎప్పుడు కలిసినా.. సినిమా గురించి, కథ గురించి, పాత్రల గురించే చర్చించుకుంటాము. ఈ సినిమా అంతా ఒక ఫ్యామిలీ వాతావరణంలో ఆడుతూ పాడుతూ జరిగింది. అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని కోరుతున్నానని తెలిపారు.

Also Read- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ యుద్ధం కూడా అలాంటిదే..

హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ.. తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే ఈ సినిమాకి తెలుగులో నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. ఈ సినిమా విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. విజయ్ సేతుపతితో నేను ఆల్రెడీ ఓ సినిమా చేశాను. అదొక డిఫరెంట్ సినిమా. ఆ సినిమాలో సైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో మాత్రం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. పాండిరాజ్ అద్భుతమైన డైరెక్టర్. ఈ కథ ఆయన చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఇది హీరో లేదంటే హీరోయిన్ సినిమా కాదు.. అంతా కలిసి చూసే ఒక ఫ్యామిలీ సినిమా. ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరం ఒక ఫ్యామిలీ‌లానే ఉన్నాం. ఈ సినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ అద్భుతంగా ఉంటాయి. నేను, నందిని రెడ్డి కలిసి ఈ సినిమా చూశాం. చాలా ఎంజాయ్ చేశాం. తమిళ్‌లో సినిమా చాలా పెద్ద హిట్. కలెక్షన్ ఫిగర్స్‌తో పాటు అందరి మనసుల్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో రిలీజవుతోంది. ఇక్కడ కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పాండిరాజ్, నిర్మాత త్యాగరాజన్ వంటి వారంతా మాట్లాడుతూ.. సినిమా టాలీవుడ్‌లోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు