Kingdom Movie Press Meet
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ యుద్ధం కూడా అలాంటిదే..

Vijay Deverakonda: వరుస ప్లాప్స్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి వస్తోన్న చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రను పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవల గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరోసారి చిత్ర హీరో, హీరోయిన్, నిర్మాత మీడియా ముందుకు వచ్చారు. సినిమా విడుదల వరకు ఎంతగా ప్రమోట్ చేయగలరో, అంతా ఈ సినిమాకు చేస్తున్నారు.

Also Read- Sithara Entertainments: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 36వ చిత్రంలో హీరో ఎవరంటే?

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ పట్ల మేమంతా చాలా సంతృప్తిగా ఉన్నాం. బుకింగ్స్‌కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ఈ భరోసాతోనే.. మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ ఇది. ఈ చిత్రంలో ఎమోషన్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. అది కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో లేదంటే.. ప్రేమ కోసమో ఉంటుంది. ఈ ‘కింగ్‌డమ్’ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి వెళ్లేలా గౌతమ్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. థియేటర్లకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కచ్చితంగా ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుందని అన్నారు.

Also Read- Rajinikanth: ఆ హీరోయిన్ హగ్ ఇవ్వలేదని సెట్ నుంచి వెళ్ళిపోయిన రజినీకాంత్?

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలకు ఓపెనింగ్స్ సరిగా లేవు. అది అందరికీ పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయినట్లే. బుకింగ్స్ చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్స్‌ను రాబట్టి సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలిలో ఎమోషన్స్‌తో నిండిన యాక్షన్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం ఎటువంటి సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టమంతా రేపు తెర మీద కనిపిస్తుందని తెలిపారు. ‘‘కింగ్‌డమ్ సినిమాలో మధు‌గా కథకు కీలకమైన పాత్రను పోషించాను. నా పాత్రను గౌతమ్ అద్భుతంగా మలిచారు. విజయ్ దేవరకొండ వంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse).

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?