Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ‘కింగ్డమ్’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత హిట్ కొట్టడంతో విజయ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘కింగ్డమ్’ సినిమాకు ముందు వేరే పేరు పెడదామనుకున్నామని తెలిపారు. తొలుత ఈ సినిమాకు ‘నాగ దేవర’ అనే టైటిల్ పెడదామనుకుంటే అది ఎన్టీఆర్ కోసం వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. అలా వచ్చిన సినిమానే ‘దేవర’ అని అన్నారు. తర్వాత ‘కింగ్డమ్’ పెట్టాల్సి వచ్చిందన్నారు. ఇదే సందర్భంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి అడగ్గా.. అప్పుడు తనకు అయిదు లక్షలు ఇచ్చారన్నారు. ఆ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నప్పుడు గర్వంగా అనిపించింది. అప్పుడు వచ్చిన అవార్డును వేలం వేస్తే రూ.25లక్షలు వచ్చాయి. వాటిని మంచి పనులకు ఉపయోగించానని అన్నారు.
Read also- Star Comedian: సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ కమెడియన్ కన్నుమూత
సినిమా తీసేటపుడు చాలా ప్రజర్ ఉంటుందన్నారు. అది హిట్ అయినా కాక పోయినా ప్రశాంతంగా అయితే కూర్చోలేం అని అన్నారు. ‘‘ఈ కథను దర్శకుడు గౌతమ్ తిన్నసూరి నాకు చెప్పిన తర్వాత దీనిని మూడు గంటల్లో చెప్పటం కష్టమనిపించింది. మొదటి పార్ట్‌లో సూరి జర్నీ మాత్రమే చూపించాం. ముఖ్యంగా అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడన్నది మాత్రమే తీశాం. అయితే, చివరి 20 నిమిషాల్లో సూరి లక్ష్యం మారిపోతుంది. ఒక కానిస్టేబుల్ కథతో మొదలై రాజు అవడంతో ఈ భాగం ముగిసింది. సూరి లాంటి పాత్ర చేయడానికి ఎం చెయ్యాలా అని తెగ ఆలోచించాను. అప్పుడు రిఫరెన్స్ కోసం ‘వైకింగ్స్’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లు చూశా. కానిస్టేబుల్‌గా కనిపించే సన్నివేశాల్లో చాలా సన్నగా కనిపిస్తా. ఎందుకు అంటే ‘ఫ్యామిలీ స్టార్’ చేయడానికి ముందు చేసిన షూట్ కావడంతో అలా ఉన్నా. ఆ తర్వాత పోరాట యోధుడిగా కనిపించేందుకు ఆరు నెలలు పాటు ప్రత్యేక కసరత్తులు చేశా’నని విజయ్ అన్నారు.
Read also- Meenakshi natrajan: బీజేపీ పాలనలో పేదల ఓట్లు గల్లంతు.. మీనాక్షి నటరాజన్!
‘కింగ్డమ్’ పార్ట్2’ గురించి
‘‘కింగ్డమ్’ పార్ట్2’ లో రానా ఉంటాడు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఎవరనేది దర్శకుడు గౌతమ్ చెబుతారు. పదేళ్ల కిందట నేను ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంత మంది మనల్ని చూడటానికి వస్తున్నారంటే అది నా అదృష్టంగా బావిస్తున్నాను. నేను ఏ డైలాగ్ చెప్పినా యాసలో ఉందని అంటున్నారు. ‘కల్కి’లో నాగ్ అశ్విన్ రాసిన డైలాగ్‌నే చెప్పాను. ఏం చేస్తాం. దేవుడు నాకిచ్చిన గొంతు అది. అసలు అర్జునుడు మాతృభాష ఏంటి?ఎలా మాట్లాడతాడు? ఏమైనా రిఫరెన్స్‌లు ఉంటాయా? ప్రతి విషయంలోనూ యాస గురించి మాట్లాడితే నేనేం చెప్పను. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నా’ అని అన్నారు. ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా చిత్రం. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ‘జెర్సీ’ ఫేమ్, ఈ సినిమాని శ్రీలంక నేపథ్యంలో రూపొందించారు. భాగ్యశ్రీ బోర్సే, వెంకటేశ్ పీసీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ నవీన్ నూలి చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.