Madhan Bob No More
Uncategorized, ఎంటర్‌టైన్మెంట్

Star Comedian: సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ కమెడియన్ కన్నుమూత

Star Comedian: ఈ మధ్యకాలంలో వరుస మరణాలు సినీ ఇండస్ట్రీని దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, అనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా ప్రముఖులెందరో మృత్యవాతపడుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కమెడియన్ మదన్ బాబ్ (71) కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మదన్ బాబు పూర్తి పేరు ఎస్ కృష్ణమూర్తి. తన తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందినట్లుగా కుమారుడు అర్చిత్ మీడియాకు తెలియజేశారు. గత కొంతకాలంగా తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స తీసుకుంటూ చెన్నైలోని నివాసంలోనే మృతి చెందినట్లుగా అర్చిత్ తెలిపారు.

Also Read- Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!

మదన్ బాబ్ కమెడియన్‌గా తిరుగులేని కీర్తిని గడించారు. ఆయనని ముద్దుగా అందరూ పున్నగై మన్నన్ అని పిలుస్తుంటారు. అంటే, చిరు నవ్వుల రారాజు అని అర్థం. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండే మదన్ బాబ్‌.. తనకే సాధ్యమైన విలక్షణమైన హాస్యాన్ని పండించారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చారు. తమిళ్‌లో ఎక్కువగా సినిమాలు చేసిన మదన్ బాబ్… మొత్తం దాదాపు 600కి పైగా చిత్రాలలో నటించారు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘వానమే ఎల్లై’ అనే చిత్రంతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు అంటే.. ‘తెనాలి’ చిత్రంలో డైమండ్ బాబుగా, ఫ్రెండ్స్ చిత్రంలో మేనేజర్ సుందరేశన్‌గా ఆయన నటించిన పాత్రలు మంచి గుర్తింపును పొందాయి. ‘దేవర మగన్, సతి లీలావతి, చంద్రముఖి, ఎథిర్ నీచల్ వంటి చిత్రాలలో ఆయన కీలక పాత్రలలో నటించారు.

Also Read- The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు అవార్డు రావడంపై ఫైర్ అయిన సీఎం

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘దేవర్ మగన్’ చిత్రంలోని తన నటనను శివాజీ గణేశన్ ఎంతగానో మెచ్చుకున్నారని తెలిపారు. ఒక్క కోలీవుడ్‌లోనే కాదు, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో కూడా మదన్ బాబ్ సినిమాలు చేశారు. చాచి 420 అనే హిందీ సినిమాలోనూ, పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ అనే తెలుగు చిత్రంలో, భ్రమరం, సెల్యులాయిడ్ అనే మలయాళ చిత్రాలలో ఆయన మంచి పాత్రలను పోషించారు. ఒక్క నటుడిగానే కాకుండా, సంగీత విద్వాంసుడిగా కూడా ఆయన రాణించారు. ఎస్ రామనాథన్, ‘విక్కు’ వినాయకరం, హరిహర శర్మ వంటి వారి వద్ద వెస్ట్రన్ క్లాసికల్, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. అంతేకాదు, ఏఆర్ రెహమాన్‌ వంటి ఆస్కార్ విన్నర్‌కు సంగీత గురువుగా మదన్ బాబ్ పేరును చెప్పుకుంటూ ఉంటారు. మదన్ బాబ్ మరణ వార్త విన్న కోలీవుడ్ సెలబ్రిటీలు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!