Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖుల జాతకాలపై అంచనాలు వేస్తూ నిత్యం వార్తల్లో ఉండే జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy). ఆ మధ్య నాగ చైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లి చేసుకున్నప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి, కోర్టు వరకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు సమంత (Samantha) రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా మళ్లీ ఆయన తెరపైకి వచ్చారు. తాజాగా ఆయన ఒక హోమం చేస్తూ కనిపించారు. ఈ హోమం ముందు ఆయన మాట్లాడుతూ.. సమంత రెండో వివాహం (Samantha and Raj Marriage) చేసుకున్న తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేసి, సమంత జాతకం ఎలా ఉంది? రాజ్ నిడిమోరు (Raj Nidimoru) పరిస్థితి ఏంటి? మూఢంలో వాళ్లు పెళ్లి చేసుకున్నారు కదా.. వారిద్దరూ కలిసి ఉంటారా? అని అడుగుతున్నారు. ఇలా ప్రశ్నలు అడిగే వారిలో మీడియా వారు, సన్నిహితులు ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో నేను అన్న వ్యాఖ్యలపై దుమారం రేపారు కదా.. మరి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు తీసుకుని జ్యోతిష్యులను సంప్రదించడం ఏంటి? వారి ముఖాల ముందు మైకులు పెట్టి.. రాద్ధాంతం చేస్తున్నారు కదా.. అది తప్పు కాదా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read- MP Niranjan Reddy: జాతీయ సంక్షోభంలో సింగిల్-స్క్రీన్ థియేటర్లు.. రాజ్యసభలో గళమెత్తిన ఎమ్‌పి
బగళాముఖి దేవి పూజ, కొత్త సినిమా కోసం యజ్ఞం
తాను ప్రస్తుతం ఓ పెద్ద తెలుగు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుతూ, ఆ సినిమా నిర్మాత, దర్శకుడు కోసం మూడు రోజులుగా (ఆది, సోమ, మంగళవారాలు) బగళాముఖి దేవి యాగం నిర్వహిస్తున్నట్లు వేణు స్వామి తెలిపారు. వీడియోలో ఆయన ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ కనిపించారు. ఓ సినిమా విజయం కోసం, ఒక జ్యోతిష్యుడి పర్యవేక్షణలో భారీ పూజలు నిర్వహించడం అనేది టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఒక ఆచారం. ప్రస్తుతం తాను ఈ పూజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, అందుకే మీడియా ప్రశ్నలకు స్పందించలేనని ఆయన వివరించారు.
సెలబ్రిటీల జాతకాలపై మీడియా టార్గెట్
గతంలో నాగ చైతన్య, శోభితా ధూళిపాల వివాహం జరిగినప్పుడు కూడా తనను చాలా మంది తిట్టారని, టార్గెట్ చేశారని వేణు స్వామి గుర్తు చేసుకున్నారు. ‘ఎవరు అడిగారని వేణు స్వామి నాగ చైతన్య, శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు’ అని విమర్శించిన వాళ్లు, మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్లు ఇప్పుడు సమంత వివాహం జరగడంతో.. మళ్లీ ఉదయం నుంచీ తనకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. జ్యోతిష్యుల నోళ్లలో మైకులు పెట్టి సమంత జాతకం ఎలా ఉంది? ఆమెకు మగపిల్లవాడు పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా? సమంత- రాజ్ కలిసి ఉంటారా? విడిపోతారా? అని పదే పదే అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read- Bigg Boss Telugu 9: మమ్మీ సంజనకు సన్ ఇమ్మానుయేల్ ఝలక్.. తాడు అలా వదిలేసిందేంటి?
నా ప్రయాణం నాదే, ఫలితం దైవాధీనం
చాలా మంది అడిగినప్పుడు.. జ్యోతిష్యులు చేసేది లేక చెప్తారు. కానీ, ఇప్పుడెందుకు మీడియా మైకులు పట్టుకుని జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు? మరి ఇప్పుడు అడిగింది సమంతనా? రాజ్ నిడుమోరినా? అని వేణు స్వామి ప్రశ్నించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటప్పుడు ఒకలాగా, మళ్లీ తమకు గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మరోలాగా మీడియా వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఈ అంశాలు తనకు పట్టవని, తన పనులు తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంటానని స్పష్టం చేశారు. ‘ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే కామాఖ్య అమ్మవారు, బగళాముఖి, చిన్నమస్తా అమ్మవార్లే నన్ను ఎలా సేవ్ చేసుకోవాలో చూసుకుంటారు’ అని చెబుతూ, తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తానని ఆయన ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. సమంత, రాజ్ నిడిమోరు వివాహంపై మాత్రం ఆయన ఏం మాట్లాడలేదు.
సినీనటి సమంత వివాహం పై నోరు విప్పిన వేణుస్వామి pic.twitter.com/SVntvossbw
— ChotaNews App (@ChotaNewsApp) December 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
