MP Niranjan Reddy: భారతదేశ సినీ పరిశ్రమకు ఒకప్పుడు గుండెకాయగా నిలిచిన సింగిల్-స్క్రీన్ సినిమా థియేటర్లు.. ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా అంతరించిపోతున్నాయని రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు ఎస్. నిరంజన్ రెడ్డి (MP Niranjan Reddy) గళమెత్తారు. దేశవ్యాప్తంగా సింగిల్-స్క్రీన్ థియేటర్ల సంఖ్య ఆందోళనకరంగా పడిపోవడాన్ని ఆయన జాతీయ స్థాయిలో చర్చించాల్సిన తక్షణ అవసరంగా అభివర్ణించారు. రాజ్యసభలో సింగిల్ స్క్రీన్ పరిస్థితిపై ఆయన వివరించిన అంశాలివే..
అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు
ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1990లో దేశంలో సుమారు 25,000 సింగిల్-స్క్రీన్ థియేటర్లు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య కేవలం 6,000కి పడిపోయింది. ఇది మూడు దశాబ్దాలలో 75 శాతానికి పైగా పతనం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావం మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 450 సింగిల్-స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడ్డాయి. అవి మూత పడటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. సింగిల్-స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి దోహదపడిన కీలక అంశాలను ఎంపీ నిరంజన్ రెడ్డి సభ దృష్టికి తీసుకెళుతూ..
Also Read- Bigg Boss Telugu 9: మమ్మీ సంజనకు సన్ ఇమ్మానుయేల్ ఝలక్.. తాడు అలా వదిలేసిందేంటి?
ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం: ప్రేక్షకుల థియేటర్లకు రావడం తగ్గించారు. దీంతో థియేటర్ల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారింది.
మల్టీప్లెక్స్‌ల విస్తరణ (Multiplex Expansion): ప్రీమియం వీక్షణ అనుభవాన్ని అందించే మల్టీప్లెక్స్‌లు సాంప్రదాయ సింగిల్-స్క్రీన్ థియేటర్ల నుండి ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో తమ వైపు ఆకర్షిస్తున్నాయి.
పెరుగుతున్న టికెట్ ధరలు (Rising Ticket Rates): అధిక ధరలు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రేక్షకులను దూరం చేస్తున్నాయి. ఈ వర్గమే సింగిల్-స్క్రీన్ థియేటర్లకు ప్రధాన ఆధారం.
అధిక ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు: సినిమాలను కొనుగోలు చేసే ఖర్చు పెరగడం చిన్న థియేటర్ల లాభదాయకతపై ప్రభావం చూపుతోంది.
OTT వైపు మళ్లిన ప్రేక్షకులు: COVID-19 మహమ్మారి తరువాత, ప్రజల సినిమాలు చూసే కోణం శాశ్వతంగా మారిపోయింది. OTT ప్లాట్‌ఫారమ్‌లకు అలవాటు పడటం వల్ల థియేటర్‌లపై ఆధారపడటం తగ్గింది.
18 పర్సంట్ జీఎస్టీ (GST): సినిమా టికెట్లపై విధించిన 18 పర్సంట్ జీఎస్టీ భారం ప్రదర్శనకారులపై, వినియోగదారులపై పడుతోంది.
ఫుడ్ అండ్ బేవరేజెస్ ధరలు: సినిమా కాంప్లెక్స్‌లలో అధిక ధరలకు అమ్ముడవుతున్న ఫుడ్ అండ్ బేవరేజెస్ కారణంగా ప్రజలు థియేటర్లకు వెళ్లడానికి నిరుత్సాహపడుతున్నారు. ఇది సింగిల్-స్క్రీన్‌లను కూడా పరోక్షంగా దెబ్బతీస్తోంది.
Also Read- Boyapati Srinu: చిరంజీవితో చేయడానికి నా దగ్గర కథ లేదు.. బోయపాటి షాకింగ్ కామెంట్స్!
ఇది కూడా ముఖ్యమైన సమస్యే
ఈ అంశాలన్నీ కలిసి సింగిల్-స్క్రీన్ థియేటర్ల వ్యవస్థను పతనం అంచుకు నెట్టాయి. దేశ సంస్కృతిలో భాగమైన ఈ థియేటర్లను రక్షించుకోవడానికి జాతీయ విధానపరమైన జోక్యం అత్యవసరం అని నిరంజన్ రెడ్డి తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఆయన ఇస్తున్న ఈ ప్రసంగాన్ని నిర్మాత ఎస్‌కెఎన్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇద్దరు నెటిజన్లు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ‘ఇంత అర్జెంట్‌గా డిస్కస్ చేయాల్సిన సమస్య ఏం కాదు ఇది’ అని నెటిజన్ చేసిన కామెంట్‌కు.. ‘వేలకొద్ది థియేటర్లు అంటే లక్షల మంది జనాలు డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా వీటిపై ఆధారపడి బతుకుతున్నారు. వారి జీవితాలను గురించి ఆలోచిస్తే.. ఇది కూడా ముఖ్యమైన సమస్యే’ అంటూ ఎస్‌కెఎన్ సమాధానమిచ్చారు. మరో నెటిజన్ ‘అన్నా మీరు అనుకున్నట్టు థియేటర్లు మూసే అంత పరిస్థితి లేదు. ఒకటే జరుగుతుంది ప్రతి సినిమాకి ప్రతి హీరో గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి జీవోలు తెచ్చుకుని రేట్లు పెంచుతున్నారు, మన ఆంధ్రాలోనే డబ్బింగ్ సినిమాలు కూడా రేట్లు పెంచుతున్నారు.. ఇంక జనాలు థియేటర్‌కి ఎందుకు వస్తారు’ అని ప్రశ్నించారు. దీనికి ఎస్‌కెఎన్ సమాధానమివ్వలేదు.
On the floor of Rajya Sabha, MP Mr S. Niranjan Reddy highlighted the crisis faced by single-screen cinemas. I
He called attention to the “unprecedented crisis” in the industry — a signal that the decline needs to be discussed at the national level
1990: ~25,000 single-screen… pic.twitter.com/1R6pkNskht
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
