Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 86వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 86) ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం కొన్ని టాస్క్‌లు నడుస్తున్నాయి. ‘ఇంటి సభ్యులందరూ ప్రతివారం అడ్డంకులు ఎన్నో దాటుకుని, ఇప్పుడీ స్థానంలో నిలబడ్డారు. ఎవరైతే ఈ రణరంగంలోని గడులు అన్నింటినీ తమ సొంతం చేసుకోగలుగుతారో, వారు చెరగని ముద్ర వేసి, ఈ సీజన్ యొక్క మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు’ అని బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి తెలిపారు. అంతేకాదు, హౌస్‌మేట్స్‌లో ముందుగా ముగ్గురు సభ్యులు పోటీ పడాలని, ఆ ముగ్గురు ఎవరనేది మీరే తేల్చుకోవాలని సూచించారు. ఆ విషయంలో తనూజ (Tanuja), రీతూ (Rithu)లకు మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తున్నట్లుగా ఇప్పటికే వచ్చిన ప్రోమో తెలియజేసింది. తాజాగా 86వ రోజుకు సంబంధించి మరో ప్రోమోని బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఆల్మోస్ట్ సంజన ఫైనలిస్ట్ రేసు నుంచి వైదొలగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రోమోని గమనిస్తే..
Also Read- Boyapati Srinu: చిరంజీవితో చేయడానికి నా దగ్గర కథ లేదు.. బోయపాటి షాకింగ్ కామెంట్స్!
ఏ గడిని కైవసం చేసుకుంటావ్..
హౌస్‌లో మమ్మీ, సన్ బాండింగ్‌తో కొనసాగుతున్న సంజన, ఇమ్మానుయేల్ మధ్య (Sanjana VS Emmanuel) టాస్క్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ టాస్క్‌లో సంజన ఓడిపోక ముందే, రూల్‌ని అతిక్రమించింది. దీంతో ఈ టాస్క్ నుంచి, ఫైనలిస్ట్ రేసు నుంచి ఆమె అవుటైనట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. ‘ఇమ్మానుయేల్.. మీ గడి పక్కన వున్న ఖాళీ గడులలో ఏ గడిని కైవసం చేసుకుంటున్నారు. మీరు ప్రస్తుతం ఉన్న గడి, మీరు ఎంచుకోబోయే గడి.. రెండూ మీవే అవుతాయి’ అని చెప్పారు. ‘వీళ్లందరినీ గెలుచుకుంటే వెళ్లి.. నేను టికెట్ తీసుకుంటానా?’ అంటూ ఇమ్మానుయేల్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అనంతరం తన ఎదురుగా ఉన్న గడిని తన సొంతం చేసుకున్నాడు.
Also Read- Nov 2025 Hits And Flops: నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ఏవి హిట్? ఏవి ఫట్?
తాడు వదిలేసింది
‘ఇమ్మానుయేల్.. మీ గడులతో బౌండరీ పంచుకుని ఉన్న ఏ ప్రత్యర్థితో పోటీ పడాలని అనుకుంటున్నారు’ అని అడుగగా.. ‘సంజనతో అనుకుంటున్నాను’ అని ఇమ్ము చెప్పారు. ‘‘ఇద్దరు పోటీ దారులకు పెడుతున్న మొదటి యుద్ధం ‘పంతం నీదా నాదా? సీసాకు ఉన్న తాడును లాగి, అవతలి వైపు ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేయాలి. చుట్టూ ఉన్న బాల్స్‌ను తీసుకుని బాక్స్‌లో విసరాలి. యుద్దం ముగిసే సమయానికి.. ఎవరు తమకు అటువైపు ఉన్న బాక్సులో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో.. వారు ఈ యుద్ధంలో విజేతలు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోప్‌ని వదలడానికి వీల్లేదు’’ అని ఈ గేమ్ కండీషన్స్‌ను చెప్పారు. సంజన, ఇమ్మానుయేల్ ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు కానీ, చివరి మూమెంట్‌లో బాల్స్ కోసం సంజన తాడు వదిలేసింది. సంచాలక్‌గా ఉన్న రీతూ అది గమనించి సంజన తాడు వదిలేసిందని చెప్పేసింది. దీంతో ఎమోషనల్ సన్నివేశం నడుస్తోంది. మొత్తంగా చూస్తే, ఇమ్మానుయేల్ ఈ టాస్క్‌లో విన్నర్ అయినట్లుగా తెలుస్తోంది. మరి అతనే ఫస్ట్ టికెట్ పొందాడో.. లేదంటో ఇంకా అతను పోరాడాల్సి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
