VD14 Movie: విజయ్ దేవరకొండ ‘VD14’ టైటిల్‌తో రెడీ అయ్యాడు..
VD14-Movie(X)
ఎంటర్‌టైన్‌మెంట్

VD14 Movie: విజయ్ దేవరకొండ ‘VD14’ టైటిల్‌తో రెడీ అయ్యాడు.. ఎప్పుడంటే?

VD14 Movie: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందుతున్న 14వ చిత్రం ‘VD14’. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు నిర్మాతలు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. జనవరి 26, 2026న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ దర్శకుడు
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి ఆదిపురుష్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read also-Megastar Catherine: మెగాస్టార్‌కు కలిసొచ్చిన ఆ హీరోయిన్ ప్రజెన్స్.. ఎవరంటే?

ఈ సినిమా 19వ శతాబ్దానికి చెందిన కథ. ప్రత్యేకంగా 1854 – 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వలసవాద చరిత్రలోని కొన్ని తెలియని అంశాలను ఇందులో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక పోరాట వీరుడి తరహాలో కనిపిస్తారని సమాచారం. విడుదలైన పోస్టర్‌లో విజయ్ పొడవాటి జుట్టు, ఒంటిపై గాయాలు, ధోతీ ధరించి ధ్యానం చేస్తున్నట్లు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హాలీవుడ్ చిత్రం ది మమ్మీ లో విలన్‌గా నటించిన ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) ఈ సినిమాలో ఒక కీలకమైన బ్రిటిష్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది (అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది). వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత నటిస్తున్న మూడవ చిత్రం ఇది. ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read also-Prabhas Spirit: ‘ది రాజాసాబ్’ నిర్మాతకు ‘స్పిరిట్’ తెలుగు రైట్స్.. మొత్తం తెలిస్తే షాక్ అవుతారు

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రీసెంట్‌గా స్పందిస్తూ, ఈ సినిమాలో విజయ్ నట విశ్వరూపాన్ని చూస్తారని, అభిమానులకు ఒక గూస్-బంప్స్ ఇచ్చే అప్‌డేట్ త్వరలోనే రాబోతుందని వెల్లడించారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిపేలా విజయ్ అభిమాని దర్శకుడికి ఓ లేఖ ద్వారా తెలిపారు. దీంతో నే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. దర్శకుడు గత రెండు సినిమాలు కూడా హిట్లు సాధించడంతో ఈ సినిమా కూడా అదే బాటలో హిట్ సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాతో అయితే విజయ్ దేవరకొండ స్టార్ డమ్ పెరుగుతుందో లేదో చూడాలి మరి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే జనవరి 26 వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాతో పాటుగు రౌడీ జనార్థన్ సినిమాను కూడా ఒకే సారి తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు  ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?