Prabhas Spirit: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కలెక్షన్ల పరంగా నిర్మాతకు కొంత అసంతృప్తినే మిగుల్చింది. దాదాపు రూ. 400 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 250 కోట్లు వరకూ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా నిర్మాత భారీగానే నష్టపోయారని తెలుస్తోంది. దీనిని భర్తీ చేసేందుకు రెబల్ స్టార్ ‘ది రాజాసాబ్’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కు అదిరి పోయే బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్త్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ‘ది రాజాసాబ్’ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ స్పిరిట్ తెలుగు థియేట్రికల్ హక్కులను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో సారి ప్రభాస్ ది రాజాసాబ్ అనిపించుకున్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీస్ లో కూడా విడుదలవుతున్న ఈ సినిమా థయేట్రికల్ హక్కులు ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా ది రాజాసాబ్ థియేట్రికల్ హక్కులు దాదాపు రూ. 950 కోట్లు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.
Read also-Dhanush Mrunal: వైరల్ అవుతున్న ధనుష్, మృణాల్ పెళ్లి వీడియో!.. అతిథులు ఎవరంటే?
సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే యానిమల్ సినిమా తీసి తన సత్తా ఏంటో చూపించారు. పాన్ ఇండియా బెగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ తో సినిమా ను ఎంతో ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సంచలనం క్రియేట్ చేసింది. ప్రభాస్ ఈ సినిమా లో పవర్ ఫుల్ కాప్ పత్రలో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘ది రాజాసాబ్’ ఆసించినంత మేర కలెక్షన్లు సాధించలేదు. దీంతో భారీ రేంజ్ లో వస్తున్న స్పిరిట్ సినిమా రైట్స్ టీజీ విశ్వప్రసాద్ కు అప్పగించేందుకు సన్నాహాలు చేకస్తున్నట్లు తెలుస్తోంది. అసలు స్పిరిట్ థియేట్రికల్ హక్కులే దాదాపు వెయ్యి కోట్లు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో అందరూ ఊహించేదే. ఇప్పటికే సందీప్ రెడ్డి ఈ సినిమా కోసం ప్రభాస్ ను ఎప్పుడూ లేని విధంగా మలుస్తున్నారని టాక్. ఏది ఏమైనా.. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ కూడా అవుతారనడంతో సందేహం లేదు. ఇప్పుడే సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే రానున్న రోజుల్లో మరెన్ని రికార్డుల చేస్తుందో చూడాలి మరి.
Read also-Divi Vadhya: ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు.. బ్రేకప్ తర్వాత అవి కామన్.. నటి దివి

