Dhanush Mrunal: తమిళ సూపర్ స్టార్ ధనుష్ విడాకుల తర్వాత మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు అందరికీ తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ, తాజాగా వీరిద్దరి AI (కృత్రిమ మేధ) వివాహ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఒక అభిమాని రూపొందించిన ఈ AI వీడియోలో ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకుంటున్నట్లు చూపించారు. విశేషమేమిటంటే, ఈ వీడియోలో ఇతర స్టార్ హీరోలు అజిత్ కుమార్, దళపతి విజయ్, త్రిష వంటి ప్రముఖులు కూడా అతిథులుగా కనిపిస్తున్నారు. ఇది చూడటానికి చాలా రియలిస్టిక్‌గా ఉండటంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు మధ్య ఇలాంటి వీడియో ప్రత్యేకత సంతరించుకుంటుంది.
Read also-Divi Vadhya: ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు.. బ్రేకప్ తర్వాత అవి కామన్.. నటి దివి
వీరిద్దరూ ఇటీవల ఒక పార్టీలో సన్నిహితంగా కనిపించడం, అలాగే ధనుష్ సోదరీమణులను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవుతుండటంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఫిబ్రవరి 14న వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మృణాల్ నేరుగా స్పందించనప్పటికీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ “Grounded, glowing and unshaken” (స్థిరంగా, వెలుగుతూ, అచంచలంగా) అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ రూమర్స్ వల్ల తనకేమీ ఇబ్బంది లేదని, తాను ప్రశాంతంగా ఉన్నానని ఆమె పరోక్షంగా చెప్పినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే తెలుగులో సీతా రామం తర్వాత డ్రీమ్ గర్ల్ గా మారిన మృణాల్ తాజాగా వచ్చిన అడవి శేష్ డెకాయిట్ గ్లింప్స్ తో మెప్పించింది.
Read also-Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?
మృణాల్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆమె ప్రస్తుతం తన సినిమా ప్రాజెక్టులతో (‘దో దివానే షెహర్ మే’, ‘డెకాయిట్’) చాలా బిజీగా ఉందని, ఇవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు. ఆ వైరల్ AI వీడియో కేవలం ఒక అభిమాని సృజనాత్మకత మాత్రమే, ధనుష్ మృణాల్ పెళ్లి వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అయితే కొందరు అభిమానులు మాత్రం ఇది నిజమైతే బాగుండునని అభిప్రాయపడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఏం జరుగుతోందో చూడాలి మరి. ఇదే సంర్భంలో పుకార్లు వస్తుండటంతో సమంత, రాజ్ నిడమోరు కూడా సడన్ గా పెళ్లి చేసుకున్నరు. ఇప్పుడు థనుష్ కూడా అలాగే సడన్ గా పెళ్లి చేసుకుంటాడని అందరు భావిస్తున్నారు. అయితే తర్వాతి రోజుల్లో ఏం జరుగుతోందో చూడాలి మిరి.
థనుష్, మృణాల్ ఏఐ పెళ్లి వీడియో.. pic.twitter.com/DW3RdXt9t5
— మంచాల బాబు (@manchalababu03) January 24, 2026

