Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్..
Tarun-Bhascker
ఎంటర్‌టైన్‌మెంట్

Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?

Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ఆర్ సజీవ్ దర్శకత్వంలో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ కు జోడీగా ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగే వినోదాత్మక గొడవలు, మహిళా సాధికారత ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో తరుణ్ భాస్కర్ ‘అంబటి ఓంకార్ నాయుడు’ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన భార్య ప్రశాంతిగా ఈషా రెబ్బా నటిస్తోంది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జే క్రిష్ సంగీతాన్ని అందించగా, దీపక్ యెరగర సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. మొదట ఈ సినిమాని జనవరి 23, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read also-Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కథ అని అర్థమవుతోంది. గోదావరి వాసుల యాస, వారి జీవనశైలిని ఇందులో సరదాగా చూపించారు. ఇందులో తరుణ్ భాస్కర్ విభిన్నమైన ఆహార్యంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని డైలాగ్స్‌ను ఆయన తనదైన శైలిలో పేరడీ చేయడం ఆకట్టుకుంటోంది. “రిచ్ ఇన్ పర్సనాలిటీ” ని “రెస్ట్ ఇన్ పీస్” (RIP) అని పొరపాటుగా అనడం వంటి సన్నివేశాలు సినిమాలో మంచి కామెడీ ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు సీనియర్ నటులు కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇది రిమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి ఎక్కడా తగ్గకుండా రూపొందించారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also- Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

Just In

01

Purushaha Movie: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పురుషః’ సాంగ్ ప్రోమో.. మగాడంటే అంతేనా మరి?

KTR on SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ.. సంచలన వ్యాఖ్యలు

Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

Veenvanka Anganwadi Centres: అంగన్వాడీ పౌష్టికాహారం పక్కదారి.. పసిపిల్లల ఆహారంపై అక్రమార్కుల కన్ను!

Groundnut Price: రికార్డ్ స్థాయిలో వేరుశనగ ధర.. తొలిసారి ఎంతకు పెరిగిందంటే?