Megastar Catherine: మెగాస్టార్ మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఏడు సినిమాల్లో చేశారు. అందులో మూడు నాలుగు మాత్రమే చెప్పుకోదగ్గ హిట్లు సాధించాయి. అందులో ఖైదీ నెం 150 హిట్ సాధించింది ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీరయ్య, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాల్లో కేదరిన్ త్రెస్సా నటించారు. ఆమె మెగాస్టార్ తో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. దీంతో ఆమె ప్రెజెన్స్ మెగాస్టార్ కు కలిసి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఖైదీ నెం 150 లో కూడా కేథరిన్ త్రెస్సా ఒక ఐటమ్ నంబర్ చేయాల్సి ఉంది, దానికి సంబంధించి అన్నీ సిద్ధం చేశాకా అనివార్య కారణాల వల్ల ఆ ఐటమ్ నంబర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా బాస్ తో కేథరిన్ ప్రజెన్స్ కలిసి వస్తుందని మెగా ప్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
Rrad also-Mouni Roy: బాలీవుడ్ నటికి ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం.. వద్దన్నా చేతులు వేస్తూ..

