VC Sajjanar - Rajinikanth
ఎంటర్‌టైన్మెంట్

VC Sajjanar – Rajinikanth: మాకు డబ్బే ముఖ్యమనుకునే వారంతా రజినీ గురించి తెలుసుకోండి!

VC Sajjanar – Rajinikanth: అడిషనల్ డీజీపీ, టీజీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన, డబ్బే ముఖ్యం.. సమాజం ఎటుపోతే మాకేంటి? అనుకునే వారంతా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలుసుకోవాలంటూ.. సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన పోస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

‘‘ప్రకటనలా.. వద్దే వద్దు అని ఉన్న ఓ పేపర్ కట్‌ని షేర్ చేశారు సజ్జనార్. అందులో.. మన దేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజినీకాంతే! అని రాసి ఉంది. ఇంకా.. ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ‘నేను ఏ యాడ్ చేసినా.. నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు. వాటిలోని లోటుపాట్లకి నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకు వద్దు’ అని రజినీ అంటారని రాసి ఉంది. ‘వీడియోల్లో నటించక్కర్లేదు.. కనీసం మీ ముఖాన్నయినా వాడుకోనివ్వండి’ అని అడిగినా కూడా ‘నో’ చెబుతారని తెలిపారు.

Also Read- 71st National Film Awards: నేషనల్ అవార్డ్ విన్నర్స్‌ని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏం హామీ ఇచ్చారంటే?

అలాంటి రజినీకాంత్ (Rajinikanth).. తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్స్ పోలియో చుక్కల మందు వ్యాప్తికి.. పైసా కూడా తీసుకోకుండా యాడ్ చేశారట. రజినీ ప్రకటనతో ఆ కార్యక్రమం కుగ్రామాల్లోకి కూడా చొచ్చుకెళ్లిందని, జనం ‘రజినీ పోలియో చుక్కలు’ అనడం ప్రారంభించారని రాసి ఉంది. ఆ తర్వాత నేత్రదానం కోసం మరో ప్రకటనలో రజినీకాంత్ నటించారు కానీ,.. అది కూడా ఉచితంగానే.’’ అని రాసి ఉన్న పేపర్ కట్‌ని షేర్ చేసిన సజ్జనార్.. రజినీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు.

Also Read- VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్య‌కి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!

‘‘మీరు ‘రియల్ సూపర్ స్టార్’ (Real Super Star) రజినీకాంత్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు. కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు. కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయకూడదనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయినా మాకేంటి? అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజినీకాంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి..’’ అని సజ్జనార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. రజినీకాంత్‌పై నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?