71st National Film Awards: తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎప్పుడు మాట్లాడినా ఒక్కటే చెబుతున్నారు. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌ని నిలపాలని, అందుకు ఏం చేయడానికైనా సిద్ధమని హామీ ఇస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలోనూ ఆయన ఈ మాట చెప్పారు. రాజమౌళి వంటి వారు, ఈ విషయంపై దృష్టి పెట్టాలని, హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్ వచ్చి.. షూటింగ్స్ చేసుకునేలా అత్యాధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్ నుంచి వివిధ విభాగాల్లో ఎంపికైన (71st National Film Awards Winners) సినీ ప్రముఖులందరూ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read- VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్యకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!
ఈ భేటీలో.. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంటూ విజేతలను అభినందించారు. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎంను కలిసిన వారంతా.. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన ‘భగవంత్ కేసరి’ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, ‘హను మాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘హను మాన్’ సినిమాకు విజువల్ ఎఫెక్ట్‌కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ.. ‘బేబి’ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ‘హను మాన్’ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి.. ‘బేబి’ సినిమా నిర్మాత ఎస్కేఎన్, ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read- Swetcha Special story: కోట్ల విలువ చేసే భూములు హాం ఫట్.. విచ్చల విడిగా అనుమతులిచ్చిన అధికారులు!
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు లభించిన అవార్డుల లిస్ట్ ఇదే..
ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ బాలనటి: సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (బేబి సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు)
ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు)
ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): సాయి రాజేష్ (బేబి)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (VFX): హను-మాన్ (జెట్టి వెంకట్ కుమార్)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ): హను-మాన్ (నందు అండ్ పృథ్వీ)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు