Varun Dhawan: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం తన సినిమా ‘బోర్డర్ 2’ విజయంతో జోరు మీదున్నారు. అయితే, తాజాగా ఆయన చేసిన ఒక పని మెట్రో అధికారులకు కోపం తెప్పించింది. ముంబై మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమోషన్ కోసం చేసిన వీడియో ఇలా చిక్కులు తెచ్చిపెడుతుందని ఎవరూ అనుకోరు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది. సమాజంలో ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన నటులు ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. దీనిని సమాధానం చెప్పాలంటూ వారు కోరుతున్నారు. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మారి.
Read also-Harish Shankar: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హరీష్ శంకర్ రియాక్షన్ చూశారా!
అసలు ఏం జరిగింది?
వరుణ్ ధావన్ తన స్నేహితులతో కలిసి ముంబై మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, రైలులో పైన ఉండే ‘గ్రాబ్ హ్యాండిల్స్’ (ప్రయాణికులు పట్టుకునే హ్యాండిల్స్) పట్టుకుని పుల్-అప్స్ (Pull-ups) చేస్తూ విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెట్రో అధికారులు రంగంలోకి దిగారు.
అధికారుల వార్నింగ్
మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ వరుణ్ ధావన్‌ను మందలించింది. ‘వరుణ్ ధావన్ గారు.. మీ యాక్షన్ సినిమాల్లో లాగా ఈ వీడియోకు కూడా ఒక డిస్క్లైమర్ (హెచ్చరిక) ఉండాలి. ముంబై మెట్రోలో ఇలాంటివి ప్రయత్నించకండి. మెట్రోలో స్నేహితులతో సరదాగా గడపడం మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ హ్యాండిల్స్ వేలాడటానికి కాదు.” అని అధికారులు పేర్కొన్నారు.
Read also-Anasuya Controversy: యాంకర్ అనసూయకు గుడి కడతానంటున్న వీరాభిమాని.. ఎక్కడంటే?
చట్టపరమైన చర్యలు
మెట్రో నిబంధనల ప్రకారం ఇలాంటి పనులు చేయడం శిక్షార్హమని అధికారులు గుర్తు చేశారు. మెట్రో రైల్వే చట్టం, 2002 చట్టం ప్రకారం మెట్రో ఆస్తులకు నష్టం కలిగించడం లేదా ప్రజలకు న్యూసెన్స్ కలిగించడం నేరం. నేరం తీవ్రతను బట్టి భారీ జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ‘బాధ్యతాయుతంగా ప్రయాణించండి’ అంటూ అధికారులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం వల్ల వారిని అనుసరించే యువత కూడా ప్రమాదకరమైన పనులు చేసే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

