Anasuya Controversy: అనసూయకు గుడి కడతానంటున్న అభిమాని
Anasuya-Controversy(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anasuya Controversy: యాంకర్ అనసూయకు గుడి కడతానంటున్న వీరాభిమాని.. ఎక్కడంటే?

Anasuya Controversy: ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం వారి వస్త్రధారణపై చర్చలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మురళీ శర్మ అనే వ్యక్తి నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాకుండా ఆమెకు గుడి కడతాను అనడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. శర్మ మాట్లాడుతూ.. హీరోలకు, హీరోయిన్లకు చాలా మందికి గుడి కట్టారు. హీరోయిన్ అయిన ఖుష్బూ గారెకి ఎలా గుడి కట్టారో, అనసూయకు కూడా అలాగే గుడి కట్టాలని, తనలాంటి ఫ్యాన్స్ అందరూ కలిసి నిర్ణయించుకున్నామని, ప్రభుత్వం, అనసూయ అనుమతి తీసుకుని ఈ కార్యానికి శ్రీ కారం చుడతామన్నారు. ఎక్కడ అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అభిమానులు అంతా చర్చించుకుని ఎక్కడ అనేది నిర్ణయిస్తామన్నారు.

Read also-Casting Couch: మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి శ్రీపద.. ఎందుకంటే?

అభిమానం

ఈ ఇంటర్వ్యూలో మురళీ శర్మ తాను అనసూయకు ‘వీరాభిమానిని’ అని బహిరంగంగా ప్రకటించారు. లోకంలో ప్రతి రంగంలోని వ్యక్తులకు అభిమానులు ఉంటారని, అది రాజకీయ నాయకులకైనా, క్రీడాకారులకైనా సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ వంటి మహనీయులను చూడకపోయినా జనం ఎలాగైతే ఆరాధిస్తారో, అలాగే నటీనటుల పట్ల ఉండే అభిమానం కూడా ఒక భావోద్వేగమని ఆయన పేర్కొన్నారు. అనసూయ పట్ల తనకు ఉన్న అభిమానం కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిత్వం పట్ల కూడా ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా అనసూయ ధరించే దుస్తుల గురించి సమాజంలో వస్తున్న విమర్శలపై మురళీ శర్మ గట్టిగా స్పందించారు. “గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు వృత్తిని బట్టి వస్త్రధారణ ఉంటుంది” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక మిస్ ఇండియా పోటీదారు లేదా ఒక హీరోయిన్ తన వృత్తిలో భాగంగా కొన్ని రకాల దుస్తులు ధరించాల్సి వస్తుందని, దాన్ని వ్యక్తిగత విమర్శలకు దారితీయడం సరైనది కాదని ఆయన వాదించారు. గరికపాటి నరసింహారావు వంటి ప్రముఖులు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదని ఆయన గుర్తుచేశారు.

Read also-Harish Shankar: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హరీష్ శంకర్ రియాక్షన్ చూశారా!

వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటర్వ్యూలో ప్రధానంగా ‘సామాన్లు’ అనే పదం వాడకంపై చర్చ జరిగింది. గతంలో అనసూయ గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అయితే, ఆ పదాన్ని తాను ఏ ఉద్దేశంతో వాడానో వివరిస్తూ, భాషలో కొన్ని పదాలకు రకరకాల అర్థాలు ఉంటాయని, వాటిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై వస్తున్న బూతు కామెంట్ల గురించి మాట్లాడుతూ, సమాజం వాస్తవాలను గ్రహించాలని స్త్రీ హక్కులను గౌరవించడం నేర్చుకోవాలని కోరారు. మురళీ శర్మ వ్యాఖ్యలు కేవలం ఒక నటిని సమర్థించడం మాత్రమే కాదు, సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించేలా ఉన్నాయి. స్త్రీ పురుష సమానత్వాన్ని రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కంటే, ఒక వ్యక్తి వృత్తిని వారి వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూడగలిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?