Harish Shankar: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రేంజ్ ఇదని.. మరోసారి చాటి చెప్పిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasada Garu). సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా విడుదలైన 15వ రోజు కూడా ఆల్ టైమ్ రికార్డులతో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమాకు ముందు చిరంజీవి కాస్త డీలా పడిన విషయం తెలియంది కాదు. ఎందుకంటే, ‘భోళాశంకర్’ దారుణమైన పరజయాన్ని చవిచూసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ‘విశ్వంభర’ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో అంతా ఇక చిరంజీవి పని అయిపోయిందని అనుకున్నారు. కానీ, తనలో సత్తా ఇంకా ఉందని, ఇప్పటికీ, ఎప్పటికీ కష్టపడే వారికి సక్సెస్ కచ్చితంగా వస్తుందని చాటి చెప్పేలా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో తనకు ఎంతో అమూల్యమైన హిట్‌ని ఇచ్చిన అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి ఓ లగ్జరీ రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Also Read- Ranabaali: విజయ్ దేవరకొండ VD14 టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అరాచకం అంతే!
లవ్ యూ ఫరెవర్ బాస్
ఈ వీడియోను షేర్ చేసిన అనిల్ రావిపూడి, సోషల్ మీడియా వేదికగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలోని డైలాగ్‌ని అన్వయిస్తూ.. ‘మెగా బహుమతి… మహదానందం, మనో ధైర్యం.. ధనా ధన్’ అని చెబుతూ.. ‘‘నా హీరో, మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ బహుమతిని అందుకోవడం నిజంగా నేను పొందిన గౌరవంగా భావిస్తున్నాను. సార్, మీ ప్రేమ, మీ మాటలు, ఆశీస్సులు నాకెంతో విలువైనవి.. వాటిని నేను మాటల్లో వర్ణించలేను. ఈ జ్ఞాపకం కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, నా జీవితాంతం నా గుండెల్లో భద్రంగా దాచుకునే ఒక తీపి జ్ఞాపకం. నేను చిన్నప్పటి నుంచి ఎవరినైతే ఎంతో ఆరాధించానో, గౌరవించానో, అటువంటి వ్యక్తి నుండి ఇలాంటి ప్రేమను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లవ్ యూ ఫరెవర్ బాస్.. మా మన శంకరవరప్రసాద్ గారు..’’ అని చిరంజీవి కారు గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోని షేర్ చేశారు.
Also Read- Poonam Kaur: పవన్ కళ్యాణ్‌కు ఆ అర్హత లేదు.. పూనమ్ షాకింగ్ పోస్ట్!
తమ్ముడూ.. నేనిచ్చే గిఫ్ట్ ఇదే..
అనిల్ రావిపూడి చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు.. మంచి ఛాన్స్ కొట్టేశావ్ అన్నా.. ఇలాగే నువ్వు హిట్స్ మీద హిట్స్ ఇస్తూ.. కార్లు గిఫ్ట్‌గా పొందాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కూడా ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. అనిల్ రావిపూడి చేసిన పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ.. ‘‘తమ్ముడూ.. త్వరగా ఆ కారేసుకుని నా దగ్గరికి వస్తే.. అందులోనే ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ వింటూ అలా డ్రైవ్ వేద్దాం. ఇదే నీకు నా గిఫ్ట్’’ అని రాసుకొచ్చారు. హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఆ కారు ఎక్కాల్సిన అవసరం నీకేంటి? అన్నా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మంచి హిట్ కొట్టు.. పవన్ కళ్యాణ్ నుంచి కారు గిఫ్ట్ కొట్టు’’, ‘ఈసారి నీకు కారు గిఫ్ట్ పక్కా’ అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్‌తో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.
తమ్ముడు ..త్వరగా ఆ కారేసుకొని
నా దగ్గరికి వస్తే ….అందులోనే
UBS కొత్త సాంగ్ వింటూ అలా డ్రైవ్ .. వేద్దాం
ఇదే నీకు నా గిఫ్ట్ 😜😜😜 https://t.co/8FQQkWKIVY
— Harish Shankar .S (@harish2you) January 26, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

