Poonam Kaur: ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ సింగ్ జీ (Guru Teg Bahadur ji) 350వ షాహిదీ సమాగమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం నేరుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో సతీమణి అన్నా కొణిదెలతో కలిసి హాజరయ్యేందుకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ఫొటోలపై పూనమ్ కౌర్ (Poonam Kaur) చేసిన పోస్ట్ ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. ఈ ఫొటోలకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు బదులిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు ఆ అర్హత లేదంటూ, మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ పూనమ్ కౌర్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. ఆమె పోస్ట్‌పై సోషల్ మీడియా అంతా ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతోంది.
Also Read- David Reddy: రూత్‌లెస్, బ్రూటల్ అవతార్‌లో మంచు మనోజ్.. భయపడాల్సిందే!
పవన్ కళ్యాణ్‌కు ఆ అర్హత లేదు
ఇందులో ముందుగా, ‘ఉత్తరాది, దక్షిణాది ప్రాతిపదికన మనల్ని విడగొట్టాలని చూసే వారి ముఖంపై ఇది ఒక గట్టి చెంపదెబ్బ’ అని ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ సిక్కు వేషధారణలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీనికి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘‘మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్. తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ కాథలిక్ క్రిస్టియానిటీగా మార్చుకున్న వ్యక్తి. ఇది మతం గురించి కాదు, కనీసం హిందుత్వ, ధర్మ రక్షక అంశాలను విడిచిపెట్టండి. గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించే అర్హత లేని చివరి వ్యక్తి అతనే’’ అని షాకింగ్ రిప్లయ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా నెటిజన్లు చేస్తున్న ట్వీట్స్‌కు రిప్లయ్ ఇస్తూనే ఉంది పూనమ్ కౌర్. ‘‘తమ వ్యసనాల వల్ల తమ వారసత్వాన్ని మార్చుకుని, తమ స్వంత మూలాలను విస్మరించేవారు.. దేశం కోసం, ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసిన మన ప్రియతమ గురువు – గురు తేగ్ బహదూర్ జీ పట్ల ఎటువంటి గౌరవం గానీ, నిబద్ధత గానీ చూపరు. వారు వేసే వేషధారణలు, ఆ నకిలీ నవ్వులు కేవలం కప్పిపుచ్చుకోవడానికే తప్ప మరొకటి కాదు. అధర్మం’’ అని పూనమ్ మరో ట్వీట్ పేల్చారు.
Also Read- Nadeem Khan: ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపుల కేసులో ‘ధురంధర్’ నటుడు అరెస్ట్..
ఎందుకింత పక్షపాత ‘ఏకత్వం’?
ఇక పూనమ్ ట్వీట్స్ చూసిన మరో నెటిజన్.. ‘‘అదే భిన్నత్వంలో ఏకత్వం అంటే. మీరంతా ఇతర మతాలను గౌరవించడం కూడా తెలియని గొర్రెల్లాంటి వారు. అన్నట్టు, అతను వారిని మార్చలేదు. వారు పుట్టుకతోనే ఆర్థోడాక్స్ క్రైస్తవులు. ఇద్దరు పిల్లలు హిందువులు. ముందు విజ్ఞతతో ఆలోచించడం నేర్చుకుని, ఆ తర్వాత ఏడవండి’’ అని పోస్ట్ చేయగా, ‘‘నీ లాజిక్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమా లేక సిక్కులపై దాడులు జరిగిన అస్సాం వరకు, లేదా మత మార్పిడులు విచ్చలవిడిగా జరుగుతున్న కేరళ వరకు ఉంటుందా? ఇది ఓకే అయినప్పుడు అది కూడా ఓకే అవ్వాలి కదా.. ఎందుకింత పక్షపాత ‘ఏకత్వం’?’’ అని పూనమ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పోస్ట్‌లతో మరోసారి పవన్ కళ్యాణ్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Brand ambassador for conversions – man who converted his legacy into orthodox catholic Christianity- not about the religion- spare the hindutva and Dharm rakshak part – last one who should pray to Guru Teg Bahadur ji .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 25, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

